clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

4.3 నక్షత్ర మండలాలు

పదకోశం



నగర కాంతుల నుండి మీరు దూరంగా ఒక చీకటి ప్రదేశంలోకి వెళితే, మీరు ఒక మబ్బుగా ఉన్న కాంతి పట్టీని మీరు ఆకాశంలో చిత్రం 2లో చూపించినట్లు గమనించవచ్చు. ఇది తెల్లగా కనపడటం వలన, దీనిని పాలపుంత అంటారు.
 

U3L4_Fig2
చిత్రం 2: భూమి నుండి చూసినప్పుడు పాలపుంత
(క్రెడిట్:స్టీవ్ జుర్వెస్టన్ -ద్వారా - ప్లిక్ర్, సిసి బి వై 2.0, https://commons.wikimedia.org/w/index.php?curid=23906915)


పురాతన కాలం నుండి, ఈ కాంతి పట్టీ గురించి ఆలోచించేవారు మరియు ఊహించేవారు.16వ శతాబ్దంలో గెలీలియో గెలిలీ అతని టెలిస్కోపు ద్వారా పాల పుంత వైపు చూసారు మరియు మొదటిసారి విడిగా ఉన్న నక్షత్రాల గుంపును చూసారుఇంకొక ఆలోచనాపరుడు, ఇమ్మాన్యుయెల్ కాంత్ చాలా సంఖ్యలో నక్షత్రాలు, గురుత్వాకర్షణ బలం వలన ఒకటిగా భ్రమణం చేస్తూ చాలా పెద్ద స్కేల్స్‌లో  సౌరకుటుంబాన్ని పోలి ఉన్నాయని ప్రతిపాదించారు. మనం చూసే నక్షత్రాలు అన్నీ మన పాలపుంతలో ఉన్నాయి. చాలా నక్షత్రాల మధ్య దూరాన్ని శాస్త్రవేత్తలు లెక్కించారు మరియు మన పాల పుంత యొక్క మ్యాపుని తయారు చేసారు (చిత్రం 3).పాల పుంత యొక్క ఆకారం మధ్యలో లావుగా ఉఁడి మరియు మిగిలిన భాగాలలో వంకులు తిరిగిన బాహువుల లాగా ఉన్నది. మన సూర్యుడు పాల పుంత యొక్క కేంద్రం నుండి చాలా దూరంలో ఉండటం సంభవిస్తుంది (మ్యాపులో దీని స్థితిని గమనించండి).పాల పుంత యొక్క వ్యాసం 100,000 మరియు 180,000 కాంతి సంవత్సరాల మధ్య ఉంటుంది. భూమి డిస్క్ లోపల ఉన్నది కావున, డిస్క్ ఒక పట్టీగా కనిపిస్తుంది. ఇంకా, మనం కేంద్రం నుడి దూరంగా ఉన్నాము కావున, పాల పుంత ఒక వైపు మందంగా మరియు ఇంకొక వైపు పలచగా కనిపిస్తుంది. అంటే తన కక్ష్యలో పాలపుంత కేంద్రం దిశగా ఉన్నప్పుడు, మనం పాల పుంతలో మందమైన పట్టీని చూస్తాము, కానీ ఆరు నెలల తరువాత, భూమి ఇంకొక వైపుకు తిరిగినప్పుడు, మనం పాలపుంత యొక్క పలుచని పట్టీ చూస్తాము.
 

చిత్రం 3: పాలపుంత యొక్క మ్యాపు
 

U3L4_Fig3a

చిత్రం 3ఎ: పైన నుండి (పై నుండి వీక్షణ)5
(క్రెడిట్: నాసా ద్వారా/జె పి ఎల్ - క్యాప్టెక్/ ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియోగ్రాండె డో సల్- http://photojournal.jpl.nasa.gov/jpeg/PIA19341.jpg, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=40704119)
 

U3L4_Fig3b
చిత్రం 3బి: ప్రోఫైల్ (పక్కవైపు నుండి వీక్షణ)6
(క్రెడిట్: ఆఱ్ జె హాల్ ఇంగ్లీషు వికిపిడియా, సి సి బి వై- ఎశ్ ఎ-3.0 ద్వారా, https://commons.wikimedia.org/w/index.php?curid=52696960)


చాలా సంవత్సరాల వరకు, వ్యక్తులు పాల పుంత వెలుపల ఏదీ లేదని అనుకునేవారు. కానీ 1920 ప్రారంభంలో, ఎడ్విన్ హబ్బుల్ అనే శాస్త్రవేత్త ఒక శక్తివంతమైన టెలిస్కోప్ ద్వారా మౌంట్ విల్సన్ లో ఇతర పాలపుంతలు చూడగలిగారు. సమీపంలో ఉన్న పాల పుంత, ఆండ్రోమెడా, వ్యాసం 2,20,000 కాంతి సంవత్సరాలతో ఉన్నది మరియు ఇది  భూమి నుండి దాదాపు 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది (చిత్రం 4)మన కంటితో చూసే ఒక నక్షత్ర మండలం ఉన్నది, కానీ అది ఒక మధ్య సైజు నక్షత్రంగా కనిపిస్తుంది.
 

U3L4_Fig4
చిత్రం 4: సమీప నక్షత్రమండలం, ఆండ్రోమిడియా భూమి నుండి దాదాపు 2.5 మిలియన్ల కాంతి సంవత్సరం దూరంలో ఉన్నది
(క్రెడిట్: ఆడమ్ ఇవాన్స్ ద్వారా- ఎమ్31, ది ఆండ్రోమిడియా గాల్కసీ (ఇప్పుడు హెచ్-ఆల్ఫాతో) అప్లోడ్ చేసిన వారు నాట్ ఫ్రమ్ యుట్రెక్ట్, సిసి బి వై 2.0, https://commons.wikimedia.org/w/index.php?curid=12654493)
 

ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చాలా నక్షత్ర మండలాలను చూసారు. నక్షత్ర మండలాలు విభిన్న ఆకారాలు మరియు సైజులలో ఉంటాయి.

Watch నక్షత్ర మండలాల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియో చూడండి

ఇక్కడ నొక్కండి  మీరు చూచిన వీడియోలో మీ ఆలోచనలను రాయడానికి
(రాయడానికి ఐకాన్ పై క్లిక్ చేయండి)
Enter

నక్షత్ర మండలాలు ఎన్ని ఉన్నాయి?
(https://www.spacetelescope.org/videos/heic1620a/)

5ఇది పాలపుంత యొక్క ఫోటో కాదు. మనం పాల పుంత ఫోటో తీసుకోలేము ఎందుకంటే మనం దాని వెలుపల ప్రయణించలేము. ఇది చిత్రం మరియు మ్యాపు యొక్క సంయోగం.
6అన్ని దిశలు ఒకే రోదసిలో ఉన్నాయి; కావున పాలపుంతకి సంబంధించి స్వాభావికమైన పైన లేదా పక్క అనేది ఉండదు. సౌకర్యం కొరకు, మనం పై నుండి లేదా పక్కవైపు నుండి పదాలను ఒక ప్లేటు లేదా డిస్కు కొరకు అన్నట్లు ఉపయోగిస్తాము.