clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

పదకోశం

 

                                                                     అం     అః                                                                                                                                             క్ష    

 
పదకోశం
ఖగోళశాస్త్ర పదాల పదబంధం

అంతరిక్ష వస్తువు (ఖగోళ వస్తువు):
విశ్వంలో ఉండి సహజంగా సంభవించే భౌతిక వస్తువు, గుంపు లేదా నిర్మాణం. (ఉదాహరణకి, ఒక తోకచుక్క, ఒక గ్రహం, ఒక నక్షత్రం, ఒక నక్షత్ర మండలం)

 

అర్ధగోళం: గోళంలో సగ భాగం. భూమికి రెండు పదాలు ఉపయోగించబడతాయి.

  1. ఉత్తర అర్ధరోళం, భూమధ్య రేఖ పైన ఉత్తర అర్ధభాగం

  2. దక్షిణ అర్ధ గోళం, భూమధ్య రేఖ క్రింద ధక్షిణ భాగం

అంతరిక్షం (రోదసి):
భూమి యొక్క వాతావారణం తరువాత మరియు ఖగోళ వస్తువుల మధ్య ఉన్న ప్రదేశం. అంతరిక్షం పూర్తిగా ఖాళీగా ఉండదు - ఇది తక్కువ సాంద్రతతో కణాలు ముఖ్యంగా హైడ్రోజన్ మరియు హీలియం యొక్క ప్లాస్మా సహా విద్యుదయస్కాంత వికిరణము, అయస్కాంత క్షేత్రాలు, న్యూట్రినోలు, దుమ్ము మరియు కాస్మిక్ కిరణాలు కలిగి దాదాపు శూన్యము.

అయనాంతం:
దూర ఉత్తరం వైపు గానీ లేదా దూర దక్షిణం వైపు గానీ సూర్యుడి మార్గం కనిపించినప్పుడు జరిగే సంఘటన. రెండు అయనాంతాలు సంవత్సరానికి, దదాపు 21 జూన్ మరియు 21 డిసెంబర్ నాడు సంభవిస్తాయి. ఇవి అత్యంత పెద్ద లేదా అత్యత చిన్న పగలు (మీరు ఉన్న అర్ధగోళాన్ని బట్టి)
అయనాంతం (సోల్ స్టైస్) అనే పదం లాటిన్ నుండి సోల్ ("సూర్యుడు") మరియు సిస్టెరె ("స్థిరంగా నిలబడటానికి") నుండి గ్రహింపబడినది, ఎందుకంటే సూర్యుని వాలు దిశను వెనుకకు మార్చుకోవడానికి "స్థిరంగా నిలబడుతుంది" లేదా ఉత్తర లేదా దక్షిణ అర్ధ గోళ పరిమితి వద్ద ఆగుతుంది.

ఆస్టిరాయిడ్లు

  1. సూర్యుడి చుట్ట కక్ష్యలో ఉండే చిన్నని శిలా వస్తువు.

  2. ఇవి పెక్కు సంఖ్యలో, విభిన్న పరిమాణాలలో ఉండి, అంగారకుడు మరియు గురు గ్రహ మధ్య ఉంటాయి, వీటిలో కొన్ని ఏక కేంద్ర కక్ష్యలలో ఉంటాయి.

ఆకాశం:
భూమి తలం పైన ఉండేది అంతా, వాతావరణం మరియు అంతరిక్షం సహా.

 

ఇంపాక్ట్ క్రేటర్స్:
సూర్య కుటుంబంలో లేదా ఇంకెక్కడైనా ఒక గ్రహం, చంద్రుడు లేదా ఇతర ఘన వస్తువు తలంలో ఒఖ చిన్న వస్తువు చాలా అధిక వేగంతో వాటి తలాను ఢీకొన్నప్పుడు ఏర్పడే దాదాపుగా ఒక వృత్తాకార నిమ్నత.

ఉపగ్రహం:
ఒక గ్రహం చుట్టూ తిరిగే ఒక వస్తువే ఉపగ్రహం. రెండు రకాల ఉపగ్రహాలు ఉన్నాయి
  1. ఒక గ్రహం చుట్టూ కక్ష్యలో ఉండే ఒక సహజ ఉపగ్రహం లేదా చంద్రుడు ఒక ఖగోళ వస్తువు
  2. కృత్రిమ ఉపగ్రహం మానవ నిర్మాణ వస్తువు ఇది ఉద్దేశ్యపూర్వకంగా రోదసిలో ఉంచబడినది మరియు విభిన్న గ్రహాల చుట్టూ తిరుగుతుంది.
 

 

ఐ 

అం

అః

కోణీయ పరిమాణం ( కోణీయ వ్యాసం, కనిపించే వ్యాసం లేదా కనిపించే పరిమాణం అని కూడా అంటారు):
                           a. కనిపించే పరిమాణం ఒక బిందువు నుండి వీక్షించినప్పుడు కనిపించే ఒక గోళం లేదా వృత్తం ఎంత పెద్దదో  వర్ణించే ఒక కోణీయ కొలత
                           b. ఇది ఒక పరిశీలన బిుందువు నుండి పరిశీలకుడు చూసినప్పుడు ఒక వస్తువు కనపడే వాస్తవ పరిమాణం.

Angular
(Image- credit: By Sriram.aeropsn - Own work, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=5745197)


కనిపించే చలనము:
పరిశీలకుని చలనము వలన ఆకాశంలో ఖగోళ వస్తువులు కదులుతున్నట్లు కనిపిస్తాయి. అవి కనిపించే చలనము వాటి వాస్తవ చలనానికి విభిన్నంగా ఉంటుంది. ఉదాహరణకి, చంద్రుడు భూమి చుట్టూ సుమారుగా 27.3 రోజుల
లొ తిరుగుతుంది కానీ భూమి మరియు చంద్రుని యొక్క చలనాలు ఒకేసారి కలసి ఉండటం వలన ఇది సుమారుగా 25 గంటలు తిరిగినట్లు కనిపిస్తుంది.

కాంతి మండలం:
  1. భూమి యొక్క కక్ష్యా తలం
  2. ఒక సంవత్సరం కాలంలో సూర్యుడు అనుసరిస్తాడని కనిపించే ఖగోళ గోళం పైన వృత్తాకార మార్గము.
కెల్విన్:
ఉష్ణోగ్రత యొక్క కొలత కెల్విన్ డిగ్రీ మరియు కెల్విన్ మధ్య సంబంధం K= ఉష్ణోగ్రత డిగ్రీలలో + 273


కేంద్రక సంలీనం:

  1. రెండు లేదా మరిన్ని పరమాణు కేంద్రకాలు తగినంత సమీపంగా వచ్చు ఒకటి లేదా మరిన్ని విభిన్న పరమాణు కేంద్రకాలు మరియు ఉపపరమాణు కణాలుగా (న్యూట్రాన్లు మరియు/లేదా ప్రోటాన్లు) ఏర్పడే ఒక చర్య.

  2. కేంద్రక సంలీనం ఒక భారీ కేంద్రకాన్ని రెండు తేలికైన కేంద్రకాలుగా చేసే ప్రక్రియ.

ఖగోళ గోళం:
ఒక ఊహాజనిత పెద్ద వ్యాసార్ధం గల ఒక పరిగ్రహణ గోళం, భూమకి ఏక కేంద్రంగా ఉన్నది. ఆకాశంలో అన్ని వస్తువులు ఖగోళ గోళం యొక్క అంతర తలం పైన ప్రక్షిప్తం చేయబడినవిగా భావించడమైనది.

ఖగోళ నెల:
రెండు వరుసపౌర్ణములు లేదా అమావాస్యల మధ్య ఉండే సమయం. నక్షత్ర నెలకి సమయం 29.531 రోజులు

గ్రహణం:
ఒక ఖగోళ వస్తువు ఇంకొక వస్తువు యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు గానీ లేదా తనకు మరియు వీక్షకుని మధ్యలో ఇంకొక వస్తువు రావడం వలన తాత్కాలికంగా కనపబడని ఒక ఖగోళ సంఘటన.

 

గ్లోబు :
మన భూమి యొక్క నమూనా ఒక గ్లోబు. మనం దానిని చూసినప్పుడు, అంతరిక్షం నుండి చూసినప్పుడు మన భూమి ఎలా కనిపిస్తుందో మనం ఊహించవచ్చు.
గ్లోబు విభిన్న రకాల పరిమాణాలు మరియు ఆకారాలు కలిగి ఉన్నది. కానీ అన్ని గ్లోబుల మీద ఇవ్వబడే అన్ని లక్షణాలు మొత్తానికి సమానంగా ఉంటాయి. కొలతకు అనుపాతంగా గ్లోబు తయారు చేయబడుతుంది మరియు భూమి యొక్క లక్షణాలను మనం గ్లోబు పైన చూడవచ్చు.


globe

 

గ్లోబులో నిలువు రేఖలు రేఖాంశాలు అని మరియు అడ్డ రేఖలను అక్షాంశాలు అని అంటారని మీరు తప్పక చదివి ఉంటారు.
భూమి పైన అతి పెద్ద అక్షాంశం అంటే, గ్లోబు యొక్క వ్యాసాన్ని భూమధ్య రేఖ అని అంటారు. గ్లోబు , ఉత్తర అర్ధగోళం మరియు దక్షిణ అర్ధం గోళం అని రెండు సమాన భాగాలుగా భూమధ్య రేఖతో విభజించబడినది.
భూమధ్య రేఖకి రెండు వైపులా 23.5 డిగ్రీల వద్ద రెండు అక్షాంశాలు ఉన్నాయి. భూమధ్య రేఖకి ఉత్తరం పైవు ఉన్న అక్షాంశాన్ని కర్కాటక రేఖ అంటారు మరియు దక్షిణం వైపు ఉన్న దానిని మకర రేఖ అంటారు.
గ్లోబు తిరిగే దిశతో గ్లోబు ఒక భ్రమణ అక్షాన్ని కలిగి ఉంటుంది. గ్లోబు యొక్క భ్రమణ అక్షం 23.5 డిగ్రీలు వీలుగా ఉంటుంది. భూమి పైన మనకి వేర్వేరు ఋతువులు ఉండటానికి ఇది ప్రధాన కారణము.
గ్లోబులో 7 ఖండాలు మరియు 5 మహాసముద్రాలు ముద్రించి ఉన్నాయి.

గురుత్వాకర్షణ:
ద్రవ్యరాశి గల అన్ని వస్తువులు పరస్పరం ఆకర్షించుకొనే ఒక సహజమైన దృగ్విషయము.


గ్రహం:
ఒక నక్షత్రం చుట్టూ ఒక కక్ష్యలో కదిలే ఒక ఖగోళ వస్తువు.

 

చంద్ర గ్రహణం:
చంద్రుడు నేరుగా భూమి వెనుకకు దాని నీడలోకి వెళ్ళినప్పుడు ఒక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఇది సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఖచ్చితంగా లేదా చాలా సమీపంగా భూమి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కావున, ఒక చంద్ర గ్రహణం ఒక పౌర్ణమి రోజు మాత్రమే జరుగుతుంది.

చంద్రుని దశ:
చంద్రుని దశ భూమిపై నుండి ఒక పరిశీలకుడు చూసే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన (సన్‌లైట్) భాగం యొక్క ఆకారం.
 

చుట్టూ తిరగడం:
ఒక వక్ర మార్గంలో (కక్ష్య) ఒక వస్తువు ఇంకొక దాని చుట్టూ తిరగడం

టైడల్ లాకింగ్:
ఒక వస్తువు యొక్క కక్ష్యా అవధి (భ్రమణం) భ్రమణ అవధికి (చుట్టూ తిరగడం) సమానమైనప్పుడు కలిగే పరి
స్థితే టైడల్ లాకింగ్.

తిథి:
చంద్ర దినం. భూమి పైన ఒక నిర్దిష్ట ప్రదేశంలో రెండు వరుస చంద్రోదయాల మధ్య సమయ అవధి.

నక్షత్రాలు (చంద్రుడి సమూహం):
కాంతి మండలం చుట్టూ 27 భాగాలు. వాటి పేర్లు సంబంధిత రంగాల్లో అత్యంత ప్రముఖమైన సమూహానికి సంబంధించినవి. ఇది చంద్రుడు (మరియు గ్రహాల) స్థితిని కనుగొనడానికి ఉపయోగించబడుతుంది.
నిష్పత్తి:
  1. ఒక నిష్పత్తి రెండు సంఖ్యల మధ్య సంబంధము. ఇది మొదటి సంఖ్యలో రెండవ సంఖ్య ఎంత ఉన్నదో సూచిస్తుంది.

  2. ఒక నిష్పత్తి రెండు సంఖ్యలను భాగాహారం ద్వారా ఒక పోలిక.

నక్షత్ర రోజు:
నక్షత్రాలకు సంబంధించి అక్షం పైన భూమి భ్రమణం చేయడానికి తీసుకున్న సమయం (సూర్యుడు కాదు) భూమి యొక్క కక్ష్యా చలనం వలన సౌర దినం కన్నా ఇది దాదాపు నాలుగు నిమిషాలు తక్కువ

నక్షత్ర నెల:
స్థిరమైన (నేపధ్యం) నక్షత్రాలలో ఒకే స్థితికి చంద్రుడు తిరిగి రావడానికి పట్టే సమయం. నక్షత్ర నెలకి సమయం 27.332 రోజులు

నక్షత్రం:
తన స్వంత గురుత్వాకర్షణతో ప్లాస్మా గోళంతో కలిపిన వెలుగునిచ్చే గోళం

 

ప్రకాశం:

  1. ఒక ఖగోళ వస్తువు యొక్క అంతర్గత ప్రకాశం.

  2. ఖగోళ వస్తువు ద్వారా యూనిట్ సమయంలో విడుదల అయ్యే మొత్తం శక్తి పరిమాణం.

ప్లాస్మా:

  1. ఒక వాయువు లాగా ఉండే ఒక పదార్థం యొక్క అయనీకరణ స్థితి

  2. ఒక అయనీకరణ వాయువులో ధనాత్మక అయానులు మరియు ఉచిత ఎలక్ట్రానులు అనుపాతంలో ఉండి చాలా అధిక ఉష్ణోగ్రతల వద్ద మొత్తం మీద విద్యుత్ ఆవేశం లేకుండా ఉంటుంది (ఉదా. నక్షత్రాలు).

పరావర్తనం:
రెండు విభిన్న యానకాల మధ్య ఒక హద్దు వద్ద ఒక కిరణం (లేదా ఒక తరంగం) యొక్క దిశలో మార్పు, తద్వారా తరంగం అది వచ్చిన యానకంలోకి వెనుకకు కదులితే , అది పరవర్తనము.

  1. ఒత వస్తువు యొక్క సాపేక్ష ద్రవ్యరాశి లేదా పదార్థంలో దానికి ఉన్న పరిమాణం, క్రిందికి బలాన్ని ఇవ్వడం; ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క భారము
  2. సాధారణంగా ఒక వస్తువు యొక్క బరువు గురుత్వాకర్షణ వలన వస్తువు పైన ఉన్న బలంగా తీసుకోబడుతుంది.

భ్రాంతి:
ఏదైనా జ్ఞానేంద్రియ అనుభవం ద్వారా సరికాని లేదా తప్పుగా అర్థం చేసుకున్న భావన

భ్రమణం:
  1. ద్విమితీయ వస్తువు (ఉదా. ఒక డిస్క్) ఒక భ్రమణ బిందువు చుట్టూ ఒక వృత్తాకార చలనము.
  2. ఒక త్రిమితీయ వస్తువు ఎల్లప్పుడూ ఒక అనంత సంఖ్యలో ఊహాజనిత గీతలను భ్రమణ అక్షం అంటారు.

రాశి (లేదా జ్యోతిష్య సంబంధ) గుర్తులు:
పశ్చిమ జ్యోతిష్యంలో, కాంతి మండలం యొక్క 30° భాగాలతో, వసంత విషువత్తు నుండి మొదలై పన్నెండు జ్యోతిష్య గుర్తులు ఉన్నాయి.

వాతావరణం:
భూమి మరియు ఇతర గ్రహం చుట్టూ ఉండే వాయువులు. భూమి యొక్క వాతావరణం కొరకు సందర్శించండి:
https://en.wikipedia.org/wiki/Atmosphere_of_Earth

విషువత్తు:
భూమి యొక్క భూమధ్యరేఖ తలం సూర్యుని డిస్క్ యొక్క కేంద్రం గుండా వెళ్ళే సంఘటన. ఇంకో మాటలలో, ఇది కనిపించే సూర్యుడి యొక్క కేంద్ర భూమద్యరేఖ పైన ఉండే బిందువు.
ఇది సంవత్సరానికి రెండు సార్లు దాదాపు 20 మార్చ్ మరియు 23 సెప్టెంబర్ మధ్య సంభవిస్తుంది. విషువత్తు నాడు పగలు మరియు రాత్రి ఖచ్చితంగా ఒకే వ్యవధి (ఒక్కోటి 12 గంటలు) ఉంటుంది.

 

శూన్యం:
పదార్థఁ లేకుండా శూన్యం

సంకేతం:
ఒక ఆలోచన లేదా అర్థాన్ని వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా చేయి లేదా తల శరీరంలో ఒక భాగం కదలిక.


స్వయం ప్రకాశకం:
తనకు తానే కాంతిని ఇచ్చే ధర్మము


సూర్య గ్రహణం:
సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు మరియు చంద్రుడు పూర్తిగా లేదా పాక్షికంగా సూర్యుడికి అడ్డు వచ్చినప్పుడు ఒక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజు నాడు మాత్రమే ఏర్పడుతుంది.


సౌర దినం:
సూర్యుడి సాపేక్షంగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి అవసరమయ్యే సమయం సౌర దినం. ఇది రెండు వరస సూర్యోదయాల మధ్య సమయం.


సమకాలీకరించిన:
ఒకే సమయం లేదా రోటులో సంభవించే ఒక ప్రక్రియ లేదా కార్యకలాపము

స్పర్శరేఖ:
ఒక వక్రాన్ని ఒక బిందువు వద్ద తాకే సరళ రేఖ, కానీ పొడిగించినప్పుడు దానిని ఆ బిందువును దాటదు.


హోరిజాన్ (స్కైలైన్):
ఆకాశాన్ని మరియు భూమిని వేరుచేసే స్పష్టమైన రేఖ.

క్ష