clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

4.2 కార్యకలాపం : పారలాక్స్ (ఊహ)

పదకోశం



విధానము:

  1. కొన్ని ఫీచర్లు (పోస్టర్లు, కిటికీలు మొదలగునవి) ఉన్న ఒక గోడని ఎంపిక చేసుకోండి. గోడ నుంచి కనీసం 10 అడుగుల దూరంలో, దాని వైపు చూస్తూ నిలబడండి.

  2. మీ ముక్కు ముందు ఒక పెన్నుని, మీ ముఖం నుండి దాదాపు ఆరు అంగుళాల దూరంలో పట్టుకోండి. ఒక కన్ను మూయండి మరియు ఒక గుర్తును గోడకు సమీపంగా (X గుర్తు అనుకుందాము) గుర్తించండి.

  3. ఇప్పుడు ఇంకొక కన్ను మూయండి మరియు మూసిన దానిని తెరవండి.పెన్ను అదే స్థితిలో కనిపిస్తుందా? లేదు! అది మారినట్లు కనిపిస్తుంది. దీనినే పారలాక్స్4 అంటారు. పెన్నుకు సమీపంగా గోడ పైన (Y గుర్తు అనుకుందాము) గుర్తుని గమనించండి.

  4. X మరియు Y గుర్తులు పరస్పరం ఎంత దూరంలో ఉన్నాయి?

  5. ఇప్పుడు దశలు 2 మరియు 3ని మీ చేయిని చాచి మళ్ళీ చేయండి. రెండు గుర్తుల మధ్య దూరం ఒకే లాగా ఉన్నదా?

  6. పెన్ను సమీపంగా ఉన్నప్పుడు రెండు గుర్తుల మధ్య దూరం ఎక్కువ అని మీరు గమనిస్తారు. వస్తువులు సమీపంగా ఉన్నప్పుడు పారలాక్స్ ఎక్కువగా ఉంటుంది.

సూర్యుడి చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని, మీకు తెలిసినదే. కావున భూమి యొక్క కక్ష్య యొక్క వ్యాసం పరంగా ఎదుటి భుజాల నుండి రెండు వాంటేజ్ బిందువులను మనం పొందుతాము (చిత్రం 1 లో స్థితి ఎ మరియు స్థితి బి)స్థితి ఎ నుండి నక్షత్రం ఎస్ వైపు చూసినప్పుడు నక్షత్రం వై సమీపంగా కనిపిస్తుంది. 6 నెలల తరువాత, స్థితి బి నుండి చూసినప్పుడు నక్షత్రం ఎస్ నక్షత్రం ఎక్స్ కి సమీపంగా కనిపిస్తుంది. ఈ స్థితిలో మార్పుని పరిశీలించడానికి చాలా మంచి నాణ్యమైన పరికరాలు కావాలి. సూర్యుడి నుండి ఒక నక్షత్రానికి మధ్య దూరం రెండు దృష్టి రేఖల మధ్య కోణం ఉపయోగించి లెక్కించినది.
 

U3L4_Fig1

చిత్రం 1: పారలాక్స్ - రెండు విభిన్న దృశ్య రేఖల నుండి చూసినప్పుడు ఒక వస్తువులో స్పష్టమైన స్థితి లో తేడా
 


నక్షత్రాలకు సున్నితమైన రంగులు ఉండటం మీరు గమనించి ఉంటారు. కొన్ని నక్షత్రాలు నీలంగా మరియు కొన్ని ఎర్రగా కనిపిస్తాయి. ఒక నక్షత్రం యొక్క రంగు ఆ నక్షత్రం యొక్క ఉష్ణోగ్రతని బట్టి ఉంటుంది. వేగా లాంటి నీలంగా ఉన్న నక్షత్రం యొక్క ఉష్ణోగ్రత ఎర్రని నక్షత్రాలైన బెటెల్గూస్ కన్నా చాలా ఎక్కువ. ఇప్పుడు నక్షత్రాలకు ఎందుకు విభిన్న ఉష్ణోగ్రతలు ఉంటాయి? ఒక నక్షత్రం యొక్క ఉష్ణోగ్రత లేదా ఒక నక్షత్రం ఉత్పత్తి చేసే శక్తి పరిమాణం ఆ నక్షత్రం యొక్క ద్రవ్యరాశి మరియు వయస్సు బట్టి ఉంటుంది.

Watchనక్షత్రాలు ఎళా ఏర్పడతాయి, అవి ఎటువంటి మార్పులకు లోనవుతాయి మరియు చివరలో వాటికి ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి క్రింది వీడియో చూడండి!
మరియు నోట్బుక్లో ఉన్న వీడియోపై మీకు ఆలోచనలను రాయండి
(రాయడానికి ఐకాన్ పై క్లిక్ చేయండి)
Enter

నక్షత్రాల మరణం
(వీడియో నుండి తీసుకోబడింది-https://www.spacetelescope.org/videos/hubblecast52a/)

4ఒక వస్తువును రెండు విభిన్న దృష్టి రేఖల నుండి చూసినప్పుడు దాని వాస్తవ స్థితిలో మార్పుని పారలాక్స్ అంటారు.