clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

4.1 నక్షత్రాలు

పదకోశం



చీకటి ప్రదేశంలో మీరు రాత్రి ఆకాశాన్ని గమించారా? మీరు వందల కొద్దీ నక్షత్రాలను తప్పక చూసి ఉంటారు. ఈ నక్షత్రాలు చాలా దూరంగా ఉన్నాయి. పరస్పరం సమీపంగా కనిపించే నక్షత్రాలు లేదా కొన్నిసార్లు ఒక నిర్దిష్ట ఆకారంలో ఉండేవి అస్సలు సమీపంగా ఉండవు. కొన్ని నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి మరియు కొన్ని పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశవంతంగా ఉండటం వాస్తవంగా అది ఎంత పెద్దగా ఉన్నది మరియు అది ఎంత దూరం ఉన్నది అనే దానిని బట్టి ఉంటుంది.

సమీప నక్షత్రం, ప్రాక్సిమా సెంటారీ, సూర్యుడి నుండి 4.25 కాంతి సంవత్సరాల1 దూరంలో ఉన్నది. సూర్యుడు (మరియు భూమి) ప్రాక్సిమా సెంటారీ నుండి ప్రయాణం చేయడానికి కాంతికి 4.25 సంవత్సరాలు పడుతుందని అర్థం. ప్రాక్సిమా తనకు తానే చిన్న నక్షత్రం మరియు కావున చాలా వెలిసిపోయినట్లు ఉంటుంది, మన కంటికి కనిపించదు, కానీ ఇది 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అల్ఫా సెంటారీ అనే మూడు నక్షత్రాల2 కుటుంబంలో భాగంగా ఉన్నది. ఇతర రెండు నక్షత్రాలు ఆల్ఫాసెంటారి దాదాపు సూర్యుడి సైజులో ఉన్నాయి. ఈ సౌర కుటుంబం మన సాధారణ కంటితో చూసినప్పుడు ఒక ఏక మూలంగా కనిపిస్తుంది మరియు రాత్రి ఆకాశంలో మూడవ అతి ప్రకాశమంతమైనది. ఇండియా నుండి, ఇది దక్షిణ అర్ధ భాగం సమీపంలో వేసవిలో (మే నుండి జూలై) కనిపిస్తుంది మరియు భారతీయ భాషలలో సముచితంగా దీనిని 'మిత్ర' (స్నేహితుడు అని అర్ధం) అంటారు. పట్టిక 1 సూర్యుని ద్రవ్యరాశితో పోల్చినప్పుడు నక్షత్రాల ద్రవ్యరాశులు (అవి ఎంత పెద్దగా ఉన్నాయి అని మనకు ఒక అంచనాని ఇస్తుంది) మరియు సూర్యుడి నుండి అతి ప్రకాశవంతమైన కొన్ని నక్షత్రాల దూరాలను తెలుపుతుంది2.

పట్టిక 1: సూర్యుడి నుండి కొన్ని అతి సమీపంగా మరియు ప్రకాశవంతమైన నక్షత్రాలకు దూరాలు

నక్షత్రం పేరు     

సూర్యుడి యొక్క ద్రవ్యరాశికి గుణిజాలు (M☉)3

దూరం కాంతి సంవత్సరంల

సూర్యుడు- భూమి దూరం 1 సెంమీ అయితే కిలోమీటర్లలో దూర

ఆల్ఫా సెంటారీ (మూడు నక్షత్రాల సమీప గుంపు, రాత్రి ఆకాశంలో మూడవ అతి పెద్ద ప్రకాశవంతంగా చేస్తుంది

1.1 M☉, 0.9 M☉, 0.1 M☉

4.25

2.7

బెర్నార్డ్ నక్షత్రం (నాలుగవ సమీప నక్షత్రం, కంటికి కనిపించదు

0.1 M☉

6

3.8

వోల్ఫ్ 359 (ఐదవ సమీప నక్షత్రం, కంటికి కనిపించదు)

0.09 M☉

7.7

4.9

సిరియస్ (రాత్రి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన రెండు నక్షత్రాలు ఉన్న గుంపు

2 M☉, 0.98 M☉

8.6

5.4

కానోపస్ (రాత్రి ఆకాశంలో రెండవ అతి ప్రకాశవంతమైన నక్షత్రం)

8.2 M☉

74

46.8

రిగెల్ (మూడు నక్షత్రాల గుంపు ఏడవ అతి ప్రకాశవంతంగా చేస్తుంది)

23 M☉, 3.8 M☉, 2.9 M☉

~ 1400

885.4

 

రిగెల్ లాంటి కొన్ని నక్షత్రాలు మన సౌర కుటుంబం నుండి 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంటే మనం రిగెల్ వైపు చూస్తే మన కళ్లకు చేరే కాంతి రిగెల్ నుండి దాదాపు 1400 సంవత్సరాల ముందు మొదలైందని అర్థం. మనం ఇప్పుడు చూస్తున్నది 1400 సంవత్సరాల ముందు రిగెల్ ఎలా ఉన్నది. అలా నక్షత్రాలు మీకు గతాన్ని చూపుతాయి (ఒక జ్యోతిష్యుడు అనుకున్నట్లు భవిష్యత్తుని కాదు!)


ఈ దూరాలు మనకు ఎలా తెలుస్తాయి? ఖచ్చితంగా ఎవ్వరూ అంత దూరం ప్రయాణించలేరు! నక్షత్రాల దూరాన్ని పారలాక్స్ పద్ధతి ఉపయోగించి కొలవబడుతుంది. ఇది ఎలా పని చేస్తుందో చూద్దాము.


[1]ఒఖ కాంతి సంవత్సరం దూరం పొడవు యొక్క యూనిట్. ఒక కాంతి సంవత్సరం శూన్యంలో కాంతి ఒక జూలియన్ సంవత్సరంలో (365.25 రోజులు) ప్రయాణించే దూరం ఇది 9.4605284 × 1015 మీటర్లకు సమానం.
[2]గురుత్వాకర్షణ బలంతో నక్షత్రం చుట్టూ గ్రహాలు కదిలినట్లు, కొన్నిసార్లు నక్షత్రాలు కూడా పరస్పర గురుత్వాకర్షణ బలంతో పరస్పరం చుట్టూ కదులుతాయి.
[3]M☉ సూర్యుడి ద్రవ్యరాశి = 1.99 × 1030 కిలోగ్రాములు