clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

2.5 తోక చుక్కలు

పదకోశం



సౌర కుటుంబంలో ఆసక్తికరమైన ఇంకొక వస్తువు తోక చుక్క. తోక చుక్కలు ధూళి మరియు మంచుతో చేయబడతాయి. అవి కూడా క్రమ రహిత ఆకారంలో ఉంటాయి మరియు వాటి గరిష్ట సైజు దాదాపు 30 కిమీ ఉంటుంది. అవి సౌర కుటుంబం యొక్క అత్యంత బాహ్య భాగం నుండి వస్తాయి, సూర్యుడి చుట్టూ తిరుగుతాయి మరియు వెనక్కి వెళతాయి. వాటిలో కొన్ని తిరిగి వస్తాయి, వాటిలో కొన్ని రావు! వాటిలో కొన్ని మార్గంలో నాశనం అవుతాయి. అవి సూర్యుడి వద్దకు రాగానే, అవి కరగడం ప్రారంభించి వాయువులను విడుదల చేస్తాయి. ఇది ఒక కనిపించే వాతావరణం లేదా కోమాని మరియు కొన్ని సార్లు తోకని కూడా ఉత్పత్తి చేస్తాయి. తోక ఎల్లప్పుడూ సూర్యుడి దూరంగా చూపబడుతుంది. ఇప్పటి వరకు మనకు 500 తోక చుక్కల కన్నా ఎక్కువ తెలుసు.
 

హేలీ అనే శాస్త్రవేత్త ఒక తోక చుక్క ప్రతి 76 సంవత్సరాలకు తిరిగి వస్తుందని కనుగొన్నారు. అతను మొదటి శాస్త్రవేత్తల గమనికలు ఉపయోగించారు, కొన్ని లెక్కలు చేసారు మరియు తోక చుక్క 1758లో తిరిగి వస్తుందని ఊహించారు. దురదృష్టవశాత్తు హేలీ,  దీనిని అతను చూడకుండా  1742 లో మరణించారు! ఈ తోక చుక్క తిరిగి ఎప్పుడు కనిపిస్తుందో కనుగొనండి. ఇండియన్ శాస్త్రవేత్త వైను బప్పు, తను హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక తోక చుక్కని కనుగొన్నారు.ఆ తోక చుక్క పేరు 'బప్పు-బోక్-న్యూక్రిక్' తోకచుక్క అని పెరు పెట్టారు (బోక్ మరియు న్యూక్రిక్ వైను బప్పుతో కలిసి పని చేసిన సహ విద్యార్థులు).


ఆసక్తి గల ఖగోళ శాస్త్రవేత్తలు (ఖగోళ శాస్త్రంలో ఆసక్తి గల వారు కానీ ఖగోళశాస్త్రంలో పనిచేస్తున్నందుకు ఏమీ ఆర్జించరు) ఆకాశాన్ని పరిశీలించి గమనికలు వ్రాస్తూ ఉంటారు. చాలా తోక చుక్కలను ఆసక్తి గల ఖగోళశాస్త్రవేత్తలు కనుగొన్నారు. విభిన్న అబ్జర్వేటరీల నుండి వారు డేటాని కూడా పొందగలరు, ఉదాహరణకి, సోలార్ మరియు హెలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ (ఎస్ ఒ హెచ్ ఒ), దానిలో విశ్లేషించి మరియు ఒక గ్రహాన్ని కనుగొంటారు. ఒక ఇండియన్ విద్యార్థి, ప్రఫుల్ శర్మ అతను XII తరగతిలో ఉన్నప్పుడు ఎస్ ఒ హెచ్ ఒ డేటా ఉపయోగించి ఒక తోకచుక్కని కనుగొన్నారు.

చిత్రం 5: తోక చుక్క

U3L2_Fig7a
చిత్రం 5ఎ: హేలీ తోక చుక్క 8 మార్చ్ 1986 నాడు తీసినది
(క్రెడిట్: నాసా ద్వారా/డబ్ల్యు. లిల్లర్ - ఎన్ ఎస్ ఎస్ డి సి యొక్క ఫోటో గ్యాలరీ (నాసా) :http://nssdc.gsfc.nasa.gov/photo_gallery/photogallery-comets.html http://nssdc.gsfc.nasa.gov/image/planetary/comet/lspn_comet_halley1.jpg, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=544352)


U3L2_Fig7b
చిత్రం 5బి: 103పి/హార్ట్లీ యొక్క కేంద్రకం ఒక అంతరిక్ష నౌక ద్వారా తీసినది.కేంద్రకం దాదాపు 2 కిమీ పొడవు ఉన్నది.
(క్రెడిట్: నాసా ద్వారా/జె పి ఎల్-కాల్టెక్/యు ఎమ్ డి - http://www.nasa.gov/mission_pages/epoxi/images/version1/IINMVUAXF_6000002_001_001_crop.html, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=11964349)

 


ఈ వస్తువులే కాకుండా, సౌర కుటుంబం దాదాపు శూన్యంగా ఉంటుంది.


సౌర కుటుంబం బయట ఏమి ఉన్నది? మన సూర్యుడు లాంటి ఇతర నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి గ్రహాలు వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను 'ఎక్సోప్లానెట్స్' అంటారు. ఇతర నక్షత్రాలు మరియు విశ్వం గురించి మనం పాఠం 4లో మరింత నేర్చుకుంటాము.