clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

2.2 చిన్న గ్రహాలు

పదకోశం



చిన్న గ్రహాలు గ్రహాల లాగే సూర్యుడి చుట్టూ తిరుగుతాయి కానీ వాటి ద్రవ్యరాశులు గ్రహాల కన్నా చాలా తక్కువ. అవి చాలా చిన్నవి మరియు వాటి ఆకారాలు గోళాకారంగా ఉండనక్కరలేదు. మొదటి చిన్న గ్రహం,  సెరెస్ 1801లో కనుగొనబడినది. ప్లూటో గతంలో గ్రహంగా పరిగణించబడినది, ఇటీవల (2006లో) ఒక చిన్న గ్రహంగా వర్గీకరించబడినదని మీకు తెలిసి ఉండవచ్చు.7 లక్షలకు పైగా చిన్న గ్రహాలు ఉన్నాయి, సాధారణంగా వాటిని అంకెలు మరియు అక్షరమాల సంయోగంతో గుర్తించబడతాయి కానీ 21,009 పేర్లు ఉన్నాయి. వాటిలో చాలా వాటికి ఆసక్తికరమైన పని చేసే వ్యక్తుల పేరుతో పిలవబడుతాయి. ఇప్పటి వరకు తొమ్మిది మంది భారతీయుల పేర్లను చిన్నగ్రహాలకు పెట్టారు! వాటిలో చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్; ఫిజిసిస్ట్ హంసా పద్మనాభన్; జువాలజిస్ట్ సైనుద్దీన్ పట్టాజీ; కంప్యూటర్ సైంటిస్ట్ అక్షత్ సింఘాల్; ఆవిష్కర్తలు, విష్ణు జయప్రకాష్, అనీష్ ముఖర్జీ, దేబరగ్య సర్కార్, హేతల్ వైష్ణవ్ మరియు మాధవ్ పాఠక్ ఉన్నారు. వారి ఆవిష్కరణలు మరియు ఆవిష్కారాలు చాలా ఆసక్తికరమైనవి. వారి ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి! వారిలో చాలా మంది చాలా చిన్న వారు స్కూలు లేదా కాలేజిలో చదవడం ముగించిన వారు వారి పేరుతో గ్రహాలని పిలవడం! మీరు కష్టపడి పని చేస్తే, మీరు కూడా ఖగోళ వస్తువుకి మీ పేరు పెట్టే అవకాశాన్ని పొందవచ్చు!

చిన్న గ్రహాలు పెద్దగా ఉన్నవి, దాదాపు గోళాకారంలో ఉన్న వాటిని మరుగుజ్జు గ్రహాలు అంటారు. సెరెస్ మరియు ప్లూటో రెండూ మరుగుజ్జు గ్రహాలు (చిత్రం 3 చూడండి). ప్లూటోకి ఛారన్ అనే చంద్రుడు కూడా ఉన్నది.

 

చిత్రం 3: మరుగుజ్జ గ్రహాలు

U3L2_Fig5a
చిత్రం 3ఎ: సెరెస్
(క్రెడిట్: జస్టిన్ కోవార్ట్ ద్వారా - సెరెస్ - ఆర్ సి 3 - హౌలని క్రేటర్, సి సి బి వై 2.0, https://commons.wikimedia.org/w/index.php?curid=49700320)
 

U3L2_Fig5b
చిత్రం 3బి: ప్లూటో మరియు దాని చంద్రుడు ఛరాన్
(క్రెడిట్: నాసా ద్వారా / జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ లేబరేటరీ / సౌత్ వెస్ట్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ - https://www.nasa.gov/mission_pages/newhorizons/images/index.html?id=371389 (see also http://photojournal.jpl.nasa.gov/catalog/PIA19966), Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=44378681)