clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

2.3 ఉపగ్రహాలు

పదకోశం



ఒక గ్రహం చుట్టూ వాటి మధ్య గురుత్వాకర్షణ బలం వలన ఒక వస్తువు కదిలినప్పుడు, దీనిని 'ఉపగ్రహం' లేదా ఆ గ్రహానికి 'చంద్రుడు' అంటారు. బుధుడు మరియు శుక్రుడు కాకుండా, అన్ని ఇతర గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి ఒకే ఒక చంద్రుడు ఉన్నది మరియు అంగారకుడికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు, మనం గురు గ్రహానికి మేము 67 ఉపగ్రహాలు కనుగొన్నాము. వాటిలో నాలుగు పెద్దవి: గానిమెడె బుధుడి కన్నా పెద్దది ఐయో మరియు కాలిస్టో మన చంద్రుడి కన్నా పెద్దవి మరియు యూరోపా మన చంద్రుడి కన్నా కొద్దిగా చిన్నది. గెలీలియో గెలీలి వాటిని ముందుగా చూసారు, ఆయన వాటిని గురు గ్రహాన్ని ఒక టెలిస్కోప్ ద్వారా 1610లో చూసారు (కావున వాటిని గెలీలియన్ చంద్రులు అంటారు).ఆయన వాటిని గురు గ్రహం యొక్క ఉపగ్రహాలుగా గుర్తించాడు. ఈ సమయంలోనే మనం ఇతర గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉంటాయని మొదటిసారి తెలుసుకున్నాము.
 

శని గ్రహానికి 62 ఉపగ్రహాలు ఉన్నాయని తెలిసింది (వాటిలో ఒకటి మాత్రమే చంద్రుడి అంత పెద్దగా ఉన్నది).యురేనస్‌కి కనీసం 27 ఉపగ్రహాలు మరియు నెప్ట్యూన్‌కి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల నుండి ఒకే సారి బహుళ చంద్రుల యొక్క దృశ్యాన్ని ఊహించుకోండి! సౌర కుటుంబంలో ఎన్నుకోబడిన చంద్రుల కొరకు చిత్రం 1 చూడండి.

U3L2_Fig1
చిత్రం 1: భూమితో పోల్చినప్పుడు సౌర కుటుంబంలోని ఎన్నుకోబడిన ఉపగ్రహాల సైజులు
(క్రెడిట్: ఒరిజినల్ గా నాసా ద్వారా అప్ లోడ్ చేయడమైనది; డియర్, కె ఎఫ్ పి, టోటోబాగిన్స్ ద్వారా సవరించబడినది - solarsystem.nasa.gov, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=1641353)



కృత్రిమ గృహాలు
మానవులు వస్తువులను ఏదైనా గ్రహం యొక్క కక్ష్యలోకి ప్రయోగించినప్పుడు, వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. భూమి చుట్టూ చాలా కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. కృత్రిమ ఉపగ్రహాలు వాతావరణ సూచన, టెలి మరియు రేడియో కమ్యూనికేషన్ మరియు జి పి ఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్), మన స్థితిని నిర్ధారించే మొబైల్స్‌లో ఉపయోగించేవి, ఉపయోగకరంగా ఉంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐ ఎస్ ఆర్ ఒ) 1975 నుండి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిస్తున్నది. కృత్రిమ ఉపగ్రహాన్ని తమ కక్ష్యలో ఉంచి మరియు ప్రయోగించడానికి ఒక రాకెట్ అవసరమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట లోని, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి భారత రాకెట్లు ఉపయోగించి చాలా కృత్రిమ ఉపగ్రహాలు ప్రయోగించబడినాయి. వాటిలో, ఖగోళశాస్త్రంలో పరిశోధనను నిర్వహించడానికి ఆస్ట్రోసాట్ అనే పేరుగల ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 28, 2015 నాడు ప్రయోగించడమైనది (చిత్రం 2 ఎ).కృత్రిమ ఉపగ్రహాలు ఇతర గ్రహాల చుట్టూ తిరగడానికి కూడా ప్రయోగించబడినాయి. మంగళయాన్ (మార్స్ ఆర్బిట్ మిషన్) అట్టి ఉపగ్రహాలలో ఒకటి ఐ ఎస్ ఆర్ ఒ ద్వారా 5 నవంబర్, 2013 నాడు ప్రయోగించబడినది.

 

చిత్రం 2: భారత కృత్రిమ గృహాలు

U3L2_Fig4a
చిత్రం 2: ఆస్ట్రోసాట్ - ఇండియా యొక్క మొదటి బహుళ తరంగధైర్ఘ్య అంతరిక్ష ప్రయోగశాలకి అంకితమివ్వబడినది.
(క్రెడిట్:ఐ ఎస్ ఆర్ ఒ http://www.isro.gov.in/astrosat/astrosat-gallery)

 

U3L2_Fig4b
చిత్రం 2బి: మంగళయాన్ (మార్స్ ఆర్బిట్ మిషన్) గురించి పనిచేస్తున్న భారత శాస్త్రవేత్త
(క్రెడిట్:ఐ ఎస్ ఆర్ ఒ http://www.isro.gov.in/pslv-c25-mars-orbiter-mission/pslv-c25-mars-orbiter-mission-gallery)