clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

2.1 కార్యకలాపం : సౌర కుటుంబంలో గ్రహాల సాపేక్ష సైజులు మరియు దూరాలు (నమూనా)

పదకోశం



పరిచయం:

గత పాఠంలో, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయని మనం చూసాము. అంతర గ్రహాలు చిన్నవి మరియు ఘన పదార్ధాలని కాగా ఇతర గ్రహాలు పెద్దవి మరియు వాయు స్థితి లేదా మంచు గడ్డతో చేయబడినాయి అని కూడా మనం నేర్చుకున్నాము. కానీ భూమి సైజుతో పోల్చినప్పుడు అవి ఎంత పెద్దవి? సూర్యుడి నుండి గ్రహాల సైజులు మరియు వాటి దూరాలను పోల్చుదాము.


కార్యకలాపం 1: సౌర కుటుంబంలో గ్రహాల సాపేక్ష సైజులు మరియు దూరాలు (నమూనా)

మెటీరియల్: ఒక కొలత టేపు, ఒక చాక్ పీసు మరియు పట్టిక 1 లో ఇవ్వబడిన వస్తువులు

పట్టిక 1: సూర్యుడి నుండి గ్రహాల యొక్క సాపేక్ష సైజులు మరియు సాపేక్ష దూరాలను తెలుపుతూ వస్తువులు

గ్రహం

వస్తువ

సూర్యుడి నుండి సాపేక్ష దూర

బుధ గ్రహం                        

ఒక చిన్న పూస (వ్యాసం ~ 0.4 సెంమీ

45.4 మీటర్ల

శుక్ర గ్రహ

ఒక గోలీ (వ్యాసం ~ 1 సెంమీ)

85 మీటర్ల

భూమి

ఒక గోలీ (వ్యాసం ~ 1 సెంమీ)

117 మీటర్ల

అంగారకుడు

ఒక చిన్న పూస (వ్యాసం ~ 0.5 సెంమీ

178 మీటర్ల

గురు గ్రహం

ఒక కొబ్బరికాయ (వ్యాసం 11 సెంమీ

601 మీటర్ల

శని గ్రహం

ఒక పెద్ద నారింజ (వ్యాసం ~ 9 నుండి 10 సెంమీ)

1119 మీటర్ల

యురేనస

టేబుల్ టెన్నిసు బంతి (వ్యాసం ~ 4సెంమీ

2250 మీటర్ల

నెప్ట్యూన్

టేబుల్ టెన్నిసు బంతి (వ్యాసం ~ 4సెంమీ)

3523 మీటర్ల

 

ప్రక్రియ:

  1. సైజుల మ్యాపింగ్: గ్రహాల యొక్క సాపేక్ష సైజులను చూపుతూ వస్తువుల యొక్క జాబితాని పట్టిక 1 తెలుపుతుంది. భూమి సైజు గోలీ సైజుతో 1 సెం. మీ. వ్యాసం అయితే, అతి పెద్ద గ్రహం అంగారకుడి సైజు ఒక కొబ్బరి కాయ సైజు వ్యాసంలో 11 సెం. మీ. ఉంటుంది. ఈ మెటీరియల్ అంతా సేకరించండి మరియు ఒక సరియైన క్రమంలో ఏర్పాటు చేయండి.

  2. దూరాలను మ్యాపింగ్ చేయడం: మీరు పైన ఉన్న అన్ని వస్తువులను ఒక వరుసలో ఉంచారా? ఖచ్చితంగా, ఒక పెద్ద బల్ల పైన మీరు తప్పక ఉంచినట్లు అవి అంత సమీపంగా లేవు. అవి ఎంత విస్తరించి ఉన్నాయి? కనుగొందాము. స్కూలు ప్లే గ్రౌండు, ఒక పెద్ద కారిడార్ లేదా అంతగా రద్దీ లేని ఒక రోడ్డు పైకి వెళ్లండి. ఒక దిశలో మనకు కనీసం 120 మీటర్ల ప్రదేశం కావాలి.

  3. భూమి వ్యాసం 1 సెంమీ అని ఊహించుకుంటే, అప్పుడు సూర్యుడు వ్యాసం 109 సెంమీ ఉండాలి. గ్రౌండు పైన 109 సెంమీ వ్యాసంతో ఒక వృత్తాన్ని గీయండి. ఇక్కడ ఈ వ్యాసంతో ఒక గోళం ఉన్నదని అనుకుందాము. ఇది మీ సూర్యుడు.(అంత పెద్ద ప్రదేశం పొందడం కష్టంగా ఉంటుంది, కావున మనం ఒక వృత్తం గీస్తాము మరియు ఒక గోళంగా ఊహిస్తాము.)

  4. ఇప్పుడు సూర్యుడి కేంద్రం నుండి 453.9 సెంమీ కొలవండి. ఇక్కడ 0.4 సెంమీ వ్యాసం గల పూసని ఇక్కడ ఉంచండి. కుంచించుకుపోయిన సౌర కుటుంబంలో, ఇక్కడ అతి చిన్న (!) బుధుడు ఉండవచ్చు!

  5. ఇప్పుడు, ఇంకొక 40 మీటర్లు (కేంద్రం నుండి 85 మీటర్లు) కొలవండి. అక్కడ శుక్రుడు గోలీ ఉంచండి.

  6. 32 మీటర్లు (సూర్యుడి కేంద్రం నుండి 117 మీటర్లు కొలవండి).ఇక్కడ భూమి గోలీ ఉంచండి.

  7. మీకు ఇంకా ఖాళీ ఉంటే, అంగారకుడు, అంటే 0.5 సెంమీ పూసని సూర్యుడి యొక్క కేంద్రం నుండి 178 మీటర్ల వద్ద ఉంచండి (భూమి నుండి 61 మీటర్లు).

  8. తరువాతి గ్రహం, అంగారకుడు, మన నమూనాలో కొబ్బరికాయ, సూర్యుడి నుండి 601 మీటర్లలో , అంటే అర కిలోమీటరు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ దూరంలో మీరు 10 నిమిషాలు బాగా నడవాలి, కావున, మిగిలిన గ్రహాలు కుంచించుకుపోయిన చోట ఊహించండి.

  9. మన నమూనాలో నారింజ అయిన శని గ్రహం, భూమి నుండి 1 కి.మీ. కన్నా ఎక్కువ దూరంలో ఉన్నది 15- నిమిషాలు నడిచే దూరంలో ఉన్నది. యురేనస్, టేబుల్ టెన్నిసు బాల్, రెండుంపావు కి.మీ. దూరంలో, 25- నిమిషాల నడక కన్నా ఎక్కువగా ఉన్నది.ఆశ్చర్యమేమీ కాదు, ఇది భూమి నుండి అంతగా కనిపించదు.

  10. చివరిగా, నెప్ట్యూన్ భూమి నుండి బాగా మూడున్నర కిమీ దూరంలో ఉన్నది (దాదాపు 40 నిమిషాల నడక దూరంలో)!దీని కక్ష్య ఎంత పెద్దగా ఉంటుందో ఊహించండి. సూర్యుడు చుట్టూ ఒక చుట్టు పూర్తి చేయడానికి నెప్ట్యూన్ దాదాపు 165 సంవత్సరాలు ఎందుకు తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాము!

సూర్యుడు మరియు గ్రహాలు కాకుండా, మన సౌర కుటుంబంలో ఇతర చిన్న వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువుల గురించి మనం మరింత నేర్చుకుందాము.