clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.3 కార్యకలాపం 1: గ్రహాలు చుట్టూ తిరగటం (రోల్ ప్లే)

 

పదకోశం

Role రోల్ ప్లే : గ్రహాలు చుట్టూ తిరగటం 
ప్రక్రియ:

  1. తొమ్మిది మంది గల ఒక సమూహాన్ని ఏర్పాటు చేయండి. ఒక  సూర్యుడు అవుతారు, ఇతరులు ఒక్కొక్కరు ఒక గ్రహం అవుతారు.

  2. విద్యార్థిప్రతి విద్యార్థి తను వచ్చిన గ్రహం చుట్టూ తిరిగే అవధిని జాగ్రత్తగా చూసి మరియు గుర్తుంచుకోవాలి.

  3. గ్రహాల లాగే అదే క్రమంలో ఒక రేఖలో ఉండాలి. సూర్యుడు, బుధుడు,   శుక్రుడు  గ్రహం...నెప్ట్యూన్.(గ్రహాలు ఎన్నడూ ఇలా ఒకే రేఖలో రావు, వాటి క్రమం మరియు సాపేక్ష వేగాలను అర్థం చేసుకోవడానికి మనం దీనిని చేస్తున్నాము).

  4. ఇప్పుడు, ముందుగా భూమి ఒక చుట్టు తిరగాలి (భ్రమణాన్ని వదిలేయండి).భూమి సూర్యుడి ఒక చుట్టు పూర్తి చేసే లోపు బుధుడు దాదాపు నాలుగు చుట్లు పూర్తి చేసేట్లు భూమి వేగం ఉండాలి.

  5. భూమి ఒక చుట్టు పూర్తి చేసిన తరువాత, మిగిలిన గ్రహాలు ప్రారంభించవచ్చు. బుధుడు వేగంగా వెళ్లాలి మరియు అంగారకుడు భూమి కన్నా కొద్దిగా నిదానంగా వెళ్లాలి. గురు గ్రహం నుండి, గ్రహాలు చాలా నిదానంగా ఉండాలి. భూమి ఒక చుట్టు పూర్తి చేసిన సమయానికి, గురు గ్రహం తన కక్ష్యలో పన్నెండవ వంతు మాత్రమే కదలాలి మరియు నెప్ట్యూన్ కేవలం ఒక అడుగు మాత్రమే కదలాలి.

  6. సూర్యుడికి సమీపంగా ఉన్న గ్రహాల చుట్టూ తిరిగే వేగం తక్కువగా ఉంటుంది. వాటి కక్ష్యలు చిన్నవి. మీరు సూర్యుడి నుండి దూరంగా వెళ్లినప్పుడు, చుట్టూ తిరిగే సమయం పెరుగుతుంది. పట్టిక 1లో, ఈ గ్రహాలు సూర్యుడి నుండి చాలా దూరంగా ఉన్నట్లు మీరు చూస్తారు. సూర్య కాంతి గురు గ్రహానికి చేరుకోవడానికి 43 నిమిషాలు మరియు నెప్ట్యూన్ చేరుకోవడానికి నాలుగు గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుంది! ప్రభావితంగా, వాటి కక్ష్యలు పెద్దవి. కావున ఆ దూరాన్ని పూర్తి చేయడానికి వాటికి ఎక్కువ సమయం పడుతుంది.

  7. సూర్యుడికి భూమి ఒక వైపున ఉండి మరియు ఒక గ్రహం ఇంకొక వైపున ఉంటే, ఆ గ్రహం కనిపించదని పరిశీలించండి. కావున, ఏదైనా రాత్రిలో, మనం ఆకాశంలో చిన్న గ్రహాలను మాత్రమే చూస్తాను.

  8.  అప్పుడప్పుడు భూమి మరియు సూర్యుడి మధ్య బుధుడు లేదా శుక్రుడు  రావడం మీరు చూస్తారు.  ఇది ఒక సూర్య గ్రహణ పరిస్థితికి చాలా సారూప్యంగా ఉంటుంది. అయితే, గ్రహాల వాస్తవ సైజు చంద్రుడి కన్నా చాలా తక్కువ కావున, అవి సూర్యుడి పూర్తి సైజుని కప్పలేవు కానీ భూమి నుండి చూసినప్పుడు, సూర్యుడి డిస్క్ పైన కదులుతున్నట్లు కనిపిస్తాయి (చిత్రం2.)ప్రయాణాలను జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం ఎందుకంటే గ్రహాల సైజు మరియు సూర్యుడి మచ్చలను నిర్ధారించడంలో అవి మనకు సహాయపడతాయి. అంకరిదు మరియు దాని తరువాత గ్రహాల నుండి భూమి ప్రయాణం కనిపించవచ్చు. అది ఆసక్తికరంగా ఉండదా? 

  9. ​సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాలు సూర్యుడి నుండి చాలా దూరంలో ఉండే గ్రహాల కంటే చాలా వేగంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. ఫలితంగా, భూమి నుండి చూసినప్పుడు, ఒక సంవత్సరం తరువాత కొన్ని గ్రహాలు పూర్తి భిన్న స్థితిలో కనిపిస్తాయి మరియు కొన్ని గ్రహాలు దాదాపు అదే ప్రదేశంలో ఉంటాయి. ఇంకొక వైపు, నక్షత్రాలు ఖచ్చితంగా ఒక సంవత్సరం తరువాత అదే స్థితిలో కనిపిస్తాయి. ఈ విధంగా మనం ఒక సంవత్సరం పూర్తయిందని తెలుసుకుంటాము. పురాతన వ్యక్తులు కొన్ని ఖగోళ వస్తువు మిగిలిన నక్షత్రాలు చేసే క్రమాన్ని పాటించవని గమనించారు. పురాతన గ్రీకులు వాటికి ‘ప్లానెటెస్ ఆస్టెరెస్, అనే పేరు పెట్టారు అంటే 'సంచార నక్షత్రాలు' అని అర్థం, వాటి నుంచే ప్రస్తుత పేరు 'ప్లానెట్స్' గ్రహింపబడినది. పూరాతన వ్యక్తులు ఈ గ్రహాలు చాలా శక్తివంతమని కూడా అనుకున్నారు (చాలా గ్రహాలు ఇతర నక్షత్రాల కన్నా ప్రకాశవంతంగా కనిపిస్తాయి మరియు విభిన్నంగా కదిలేవి).కావున గ్రహాలు భూమి పైన జీవనాన్ని ప్రభావితం చేయగలవని వారు అనుకున్నారు. ఇలా జ్యోతిషశాస్త్రం అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు నక్షత్రాల కన్నా గ్రహాలు ఎందుకు విభిన్నంగా కదులుతున్నట్లు కనిపిస్తాయి మరియు అవి ఎందుకు ప్రకాశవంతంగా ఉంటాయో మనకు తెలుసు! ఇంతేకాకుండా, పైన జీవం లేని ఒక వస్తువు, మన కన్నా చాలా దూరంలో ఉన్నది, మన జీవితాల పైన ప్రభావాన్ని చూపగలదు?మరియు అది వ్యక్తి నుండి వ్యక్తి ఎలా వేరుగా ఉంటుంది? కావున మీ జీవితంలో గ్రహాల వలన ఏదైనా జరిగిందని ఎవరైనా మీకు చెబితే, మీరు నమ్మడానికి ముందు దాని గురించి ఆలోచించండి! 

 

చిత్రం 2: బుధుడు మరియు శుక్రుడి ప్రయాణం

U3L1_Fig2a
చిత్రం 2ఎ: బుధుడి ప్రయాణం (8 నవంబర్ 2006 నాడు తీసినది)
(క్రెడిట్: నాసా ద్వారా - http://www.nasa.gov/images/content/162385main_Merctransit2006_sm.jpg on http://www.nasa.gov/vision/universe/solarsystem/20oct_transitofmercury.html, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=1355554)
 

U3L1_Fig2b
చిత్రం 2బి: శుక్రుడి ప్రయాణం ( 8 జూన్ 2012 నాడు తీసినది)
(క్రెడిట్: నాసా ద్వారా - https://www.nasa.gov/mission_pages/sdo/multimedia/gallery/venus-transit-2012-first.html)



Draw     సూర్యుని ఉత్తర ధ్రువం పైన నుండి నుండి చూసినట్లు సౌర కుటుంబం యొక్క చిత్రాన్ని గీయండి. అన్ని గ్రహాలు మరియు వాటి కక్ష్యలు   (భూమిలాగా, అన్ని కక్ష్యలు దాదాపు వృత్తాకారంగా ఉంటాయి) చూపండి. భూమి నుండి చూసినప్పుడు గ్రహాలు ఉన్న స్థితిలో చూపడానికి ప్రయత్నించండి,

  1. బుధుడి ప్రయాణం చూడవచ్చు.

  2. శుక్రుడు సూర్యుడి వెనుక ఉన్నది (ఈ పరిస్థితిని సముచ్ఛయం అంటారు)

  3. అంగారకుడు సూర్యుడితో సముచ్ఛయంలో ఉన్నది.

  4. గురు గ్రహం అర్ధరాత్రి జెనిత్‌లో కనిపిస్తుంది.

  5. శని గ్రహం అర్ధరాత్రి ఉదయిస్తున్నట్లు కనిపిస్తుంది.

  6. యురేనస్ అర్ధరాత్రి అస్తమిస్తున్నట్లు కనిపిస్తుంది.

  7. సూర్యాస్తమ సమయంలో నెప్ట్యూన్ జెనిత్ పైన ఉన్నట్లు కనిపిస్తుంది.

    డ్రాయింగ్ కోసం మీ నోట్బుక్ని ఉపయోగించండి. మీరు డ్రాయింగ్ చేస్తున్న పేజీలో రాయండి: ప్రాథమిక ఖగోళ మాడ్యూల్: యూనిట్ 3: లెసన్ 1: కార్యకలాపం 1 & మీ లాగిన్ ID

ఇంత వరకు మేము అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల ద్వారా గ్రహాల గురించి మేము సమాచారాన్ని సేకరించాము. కొంత ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ ఉన్నది. మొదటి నాలుగు గ్రహాలు, అంతర గ్రహాలుగా తెలుపబడిన వాటికి (బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడు) ఘన ఉపరితలాలు (దాని చుట్టూ ఒక ద్రవ పొరతో లేదా లేకుండా) ఉన్నాయి. కావున వాటిని రాతి గ్రహాలు అంటారు. నాలుగు ఇతర గ్రహాలు (గురు గ్రహం, శని గ్రహం, యురేనస్ మరియు నెప్ట్యూన్) అంతర గ్రహాల కన్నా చాలా పెద్దవి, కావున వాటిని దిగ్గజ గ్రహాలు అంటారు. గురు గ్రహం మరియు శని గ్రహం వాయువులతో (చాలా వరకు హైడ్రోజన్ మరియు హీలియం) చేయబడి ఉన్నాయి మరియు యురేనస్ మరియు నెప్ట్యూన్ విభిన్న రకాల మంచు గడ్డతో చేయబడి ఉన్నాయి.

అంతర గ్రహాలు

  • మన సౌర కుటుంబంలో బుధుడు అతి చిన్న, తేలికైన మరియు అత్యంత వేగవంతమైన గ్రహం. దీనిలో వాతావరణం లేదు. సూర్యుడికి అతి సమీపంగా ఉండటం వలన, ఆ ప్రాంతాలలో ఉష్ణోగ్రత పగలు చాలా ఎక్కువగా (~ 427°సెం) ఉంటుంది. కానీ వాతావరణం లేకపోవడం వలన, అది రాత్రి పూట చాలా చల్లబడుతుంది (-173°సెం).కావున పగటి పూట ఉష్ణోగ్రతలు మరియు రాత్రి పూట ఉష్ణోగ్రతలు బుధుడి పైన అత్యధికంగా ఉంటాయి.
  • దీని తరువాత, శుక్రుడు మేఘాలతో కప్పబడి ఉంటుంది. ఈ మేఘాల నుండి సూర్య కాంతి పరావర్తనం చెందుతుంది, అందుకే ఇది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది! ఈ మేఘాల మధ్య ఉష్ణము చిక్కుకుంటుంది, ఇది సౌర కుటుంబంలో శుక్రుడిని అత్యంత వేడి గల గ్రహంగా చేస్తుంది (గరిష్ట ఉష్ణోగ్రత 462°సెం).శుక్రుడు దాదాపు భూమి సైజులో ఉంటుంది. ఉత్తర ధృవం నుండి చూసినప్పుడు, శుక్రుడు తప్ప అన్ని గ్రహాలు అపసవ్య దిశలో భ్రమణం చేస్తున్నట్లు కనిపిస్తాయి. శుక్రుడి నుంచి సూర్యుడు మరియు నక్షత్రాల మార్గం ఎలా కనిపిస్తుందో ఊహించండి!
  • మనం జీవించే గ్రహము భూమి. దీనికి ఘన ఉపరితలంతో ఎక్కు భాగం నీటి పొరతో ఉన్నది మరియు దీని చుట్టూ దాదాపు 100 కిమీలో వాతావరణం ఉన్నది. కానీ, మనకు భూమి గురించి దాని కన్నా ఎక్కువ తెలుసు! కానీ భూమిని అధ్యయనం చేయడానికి, 'ఎర్త్ సైన్స్' లేదా 'జియోసైన్స్' అనే ఒక ప్రత్యేక విభాగం ఉన్నది.
  • అంగారక గ్రహంలో ఐరన్ ఆక్సైడ్ (తుప్పు పట్టిన ఇనుము) ఉన్నది అందుకే ఇది ఎర్రగా కనిపిస్తుంది. దీనిలో దీని ధృవాల పైన మంచు గడ్డ పొర ఉన్నది.
 

మన గ్రహాలు

  • మన సౌర కుటుంబంలో గురు గ్రహం అతి పెద్దది మరియు అతి బరువైన గ్రహం. ఒక టెలిస్కోప్ నుండి చూసినప్పుడు, దానిలో మనం ఎర్ర మచ్చని చూస్తాము. ఇది గత 350 సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఒక తుఫాను. ఈ తుఫాను యొక్క వ్యాసం భూమి ఒక్క వ్యాసానికి మూడు రెట్లు ఉన్నది. దీనిని 'గ్రేట్ రెడ్ స్పాట్' అంటారు.

  • శని గ్రహం దీని వలయాలకు ప్రసిద్ధి చెందినది. దుమ్ము మరియు మంచు గడ్డతో తొమ్మిది వలయాలు చేయబడినాయి. ఈ వలయాల గరిష్ట మందం ఒక కిమీ మాత్రమే! శని గ్రహం కూడా వాయువు దిగ్గజం. దీని సాంద్రత 0.7 గ్రా/సెంమీ3 సమీపంగా ఉంటుంది ఇది నీటి సాంద్రత కన్నా తక్కువ. గుర్తుంచుకోండి, సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద, స్వచ్ఛమైన నీటి సాంద్రత 1 గ్రా/సెంమీ3.ఇది అన్ని గ్రహాలలో కనీస సాంద్రతగా చేస్తుంది.

  • సూర్యుడి నుండి చాలా దూరంగా ఉండటం వలన, యురేనస్ చాలా చల్లగా ఉంటుంది. ఇది హైడ్రోజన్, హీలియం మరియు కొద్ది మొత్తంలో మిథేన్ మరియు అమ్మోనియాతో చేయబడి ఉంటుంది. భూమి పైన, ఈ మూలకాలు లేదా సంయోగ పదార్ధాలు వాయురూపంలో ఉండవచ్చు, కానీ యురేనస్ లో గడ్డకట్టి ఉంటాయి. దాని కక్ష్యా తలం పైన ఉండేట్లు యురేనస్ అక్షం వంచబడి ఉంటుంది. యురేనస్‌లో పగలు మరియు రాత్రి సంభవిస్తాయా? యురేనస్‌లో ఋతువులు సంభవిస్తాయా? అవును అయితే, అవి ఎలా ఉంటాయి?

  • పైన గాలి యొక్క గరిష్ట వేగం (2,100 కిలోమీటర్లు గంటకు) సౌర కుటుంబంలో అత్యధికంగా ఉంటుంది. గురు గ్రహం పైన గ్రేట్ రెడ్ స్పాట్ లాంటి తుఫాను 'గ్రేట్ డార్క్ స్పాట్' ఉన్నది.నెప్ట్యూన్ లో గాలులతో కూడిన వాతావరణం ఉన్నది. నెప్య్టూన్.


చిత్రం 3: మన సౌర కుటుంబం లోని గ్రహాల ఫోటోలు

U3L1_Fig3a
చిత్రం 3ఎ: బుధ గ్రహం
(క్రెడిట్: నాసా ద్వారా https://solarsystem.nasa.gov/planets/mercury/galleries)
 

U3L1_Fig3b
చిత్రం 3బి: శుక్ర గ్రహం
(క్రెడిట్: నాసా ద్వారా - http://photojournal.jpl.nasa.gov/catalog/PIA00104, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=11826)

U3L1_Fig3c
చిత్రం 3సి: భూమి;రాత్రి పూట వెలుతురు ఉండే ఏకైక గ్రహం!
(క్రెడిట్: నాసా ఎర్త్ అబ్జర్వేటరీ చిత్రం, మిగ్యుయెల్ రోమన్స నాసా యొక్క గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నుండి సౌమి ఎన్ పి పి వి ఐ ఐ ఆర్ ఎస్ డేటా జోషువా స్టీవెన్స్ ద్వారా)
 

 

U3L1_Fig3d
చిత్రం 3డి: అంగారకుడు
(క్రెడిట్: ఇఎస్ఎ ద్వారా - యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ మాక్స్- ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టం రీసర్చ్ ఫర్  ఒ ఎస్ ఐ ఆర్ ఐ ఎస్ టీం  ఇ ఎస్ ఎ/ ఎమ్ పి ఎస్/యు పిడి/ఎల్ ఎ ఎమ్/ ఐ  ఎ ఎ/ఆర్ ఎస్ ఎస్ డి/ఐ ఎన్ టి ఎ/యు పి ఎమ్/ డిఎ ఎస్ పి/ఐ డి ఎ   - http://www.esa.int/spaceinimages/Images/2007/02/True-colour_image_of_Mars_seen_by_OSIRIS, CC BY-SA 3.0-igo, https://commons.wikimedia.org/w/index.php?curid=56489423)

 

U3L1_Fig3e
చిత్రం 3ఇ: గురు గ్రహం
(క్రెడిట్: నాసా ద్వారా, ఇ ఎస్ ఎ మరియు ఎ. సైమన్ (గోడ్డార్ స్పేస్ ఫ్లైట్ సెంటర్) - http://www.spacetelescope.org/images/heic1410a/ or http://hubblesite.org/newscenter/archive/releases/2014/24/image/b/, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=32799232)

 

U3L1_Fig3f
చిత్రం 3ఎఎఫ్: శని గ్రహం
(క్రెడిట్: నాసా / జెపిఎల్ / స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా - http://www.ciclops.org/view/5155/Saturn-Four-Years-On http://www.nasa.gov/images/content/365640main_PIA11141_full.jpg http://photojournal.jpl.nasa.gov/catalog/PIA11141, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=7228953)

 

U3L1_Fig3g
చిత్రం 3జి: యురేనస్
(క్రెడిట్:నాసా/జెపిఎల్-కాల్టెక్ ద్వారా- http://web.archive.org/web/20090119235457/ http://planetquest.jpl.nasa.gov/milestones_show/slide1.html (image link) http://photojournal.jpl.nasa.gov/catalog/PIA18182 (image link), Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=5649239)

 

U3L1_Fig3h
చిత్రం 3హెచ్: నెప్ట్యూన్
(క్రెడిట్:నాసా ద్వారా - జె పి ఎల్, పబ్లిక్ డొమెయిన్, https://commons.wikimedia.org/w/index.php?curid=640803)


చర్చించండి
1.ఖగోళ వస్తువులు (ఉదా., గ్రహాలు, తోకచుక్కలు) లేదా దృగ్విషయాలు (గ్రహణాలు, ఉల్కలు రాలడం) మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? జంతువులు లేదా వృక్షాల జీవితాలలో కూడా ప్రభావితం చేయగల…...వని మీరు అనుకుంటున్నారా? అవును అయితే, కారణాలు ఇవ్వండి, లేదు అయితే, మీ జవాబు ఇవ్వండి.

2.ఖగోళ శాస్త్రానికి సంబంధించి మూఢనమ్మకాలను జాబితా చేయండి (అందరికీ అవకాశం రావడానికి ముందుగా మీ జవాబుని ఒక్క పేరుకి మాత్రమే పరిమితం చేయండి. ఒక వారం తరువాత జాబితా అసంపూర్తిగా ఉంటే మీకు తెలిసినన్ని రాశి పేర్లు చెప్పండి కానీ, ప్రతిస్పందన పునరావృతం చేయవద్దు)