clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.2 గ్రహాలు

పదకోశం


అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయని మీరు తప్పక తెలుసుకోవాలి. మీరు వాటి పేర్లు చెప్పగలరా? సరే, వాటిలో భూమి ఒకటి!మిగిలిన ఏడు గ్రహాలో, ఐదిటిని మన కంటితో చూడవచ్చు. అవి బుధుడు, అంగారకుడు, శుక్రుడు, గురు గ్రహం మరియు శని గ్రహం. వాస్తవానికి, చంద్రుడు మరియు శుక్రుడు తరువాత రాత్రి ఆకాశంలో గురు గ్రహం అత్యంత ప్రకాశవంతమైన వస్తువు. అంగారకుడు మరియు శని గ్రహాలు కూడా రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులు ఎందుకంటే అవి నక్షత్రాలకు చాలా సమీపంగా ఉన్నాయి. మీ ఉపాధ్యాయుడు లేదా గ్రహాలను గుర్తించే ఎవరి సహాయంతోనైనా వాటిని పరిశీలించడానికి ప్రయత్నించండి. యురేనస్ మరియు నెప్ట్యూన్‌లను గమనించడానికి మీకు ఒక టెలిస్కోప్ కావాలి. ఈ గ్రహాలు అన్నీ విభిన్న సైజులలో, సూర్యుడి నుండి విభిన్న దూరాలలో ఉన్నాయి మరియు విభిన్న వేగాలతో అవి భ్రమణం చేస్తూ మరియు తమ చుట్టూ తిరుగుతాయి.(మరిన్ని వివరాల కొరకు పట్టిక 1 చూడండి).

పట్టిక 1: సూర్యుడు మరియు గ్రహాల యొక్క ప్రాథమిక సమాచారం

 

గ్రహం పేరు

ద్రవ్యరాశి
(M⊕)

వ్యాసార్ధం
(R⊕)

సూర్యుడి నుండి సగటు
దూరం (ఎ యు)

భ్రమణ కాలం

చుట్టూ తిరగటం కాలం

సూర్యుడు

332946         

109

0

25 భూమి రోజులు

వర్తించదు

బుధ గ్రహం

0.06

0.38

0.387

58.65 భూమి రోజులు

87.97 భూమి రోజులు

అంగారకుడు       

0.82   

0.95

0. 723

243.03 భూమి రోజులు

1.88 భూమి సంవత్సరాలు

భూమి

1

1

1

1 భూమి రోజు

365.256 భూమి రోజులు

    

శుక్ర గ్రహం

0.11

0.52

1.524

24 గంటల
37 నిమిషాలు

224.7 భూమి రోజులు

గురు గ్రహం

317.8

11.21    

5.203

9 గంటల
50 నిమిషాలు

11.86 భూమి సంవత్సరాలు

శని గ్రహం

95.2

9.45

9.537

10 గంటల
14 నిమిషాలు

29.46 భూమి సంవత్సరాలు

యురేనస్

14.6

4.01

19.19

17 గంటల
14 నిమిషాలు

84.01 భూమి సంవత్సరాలు

నెప్ట్యూన్

17.2

3.88

30.07

16 గంటల
3 నిమిషాలు

164.8 భూమి సంవత్సరాలు

M⊕:ద్రవ్యరాశి (భూమి యొక్క గుణిజాలు); భూమి యొక్క ద్రవ్యరాశి 5.97×1024 కిగ్రా

R⊕:వ్యాసార్ధం (భూమి యొక్క గుణిజాలు); భూమి యొక్క వ్యాసార్ధం 6371 కిమీ

1 ఎ యు (ఆస్ట్రనామికల్ యూనిట్):భూమి కేంద్రం నుండి సూర్యుడి కేంద్రానికి మధ్య సగటు దూరం = 149.6×106 కిమీ

 

పట్టిక 1ని చూసి, క్రింది వాటికి సమాధానం మీ నోట్‌బుక్‌లో వ్రాయండి

  1. ఏ గ్రహం లేదా గ్రహాలు భూమి లాగ ఉన్నాయి, మరియు ఏ అంశంలో. ఉదాహరణకు- శుక్రుడి యొక్క భ్రమణ కాలం భూమి లాగా ఉంటుంది, అది 24 గంటలు మరియు 37 నిమిషాలు.

  2. అతి పెద్ద గ్రహం ఏది?

  3. అతి చిన్న గ్రహం ఏది?

  4. సూర్యుడికి సమీపంగా ఉన్న గ్రహం ఏది?

  5. సూర్యుడి నుండి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏది?

  6. సూర్యుడి చుట్టూ ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి అతి తక్కువ సమయం తీసుకునే గ్రహం ఏది?

  7. సూర్యుడి చుట్టూ ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి అతి ఎక్కువ సమయం తీసుకునే గ్రహం ఏది?


(రాయడానికి ఐకాన్ పై క్లిక్ చేయండి)
Enter
నోట్‌బుక్‌లో ఇతరులు పంచుకున్నవి సరైనవో కావో చూడండి, ఏదైనా ఆసక్తికరంగా లేదా సమస్యాత్మకంగా ఏదైనా కనుగొంటే ఇతరుల పోస్టుల పైన వ్యాఖ్యానించండి.

ఒక కార్యకలాపం ద్వారా సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు ఎలా కదులుతాయో చూద్దాము.