clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.1 సూర్యుడు

పదకోశం
 


పరిచయం

యూనిట్ 1 మరియు 2లో, మీరు భూమి మరియు దాని ఉపగ్రహం, చంద్రుడి గురించి నేర్చుకున్నారు. భూమి కాకుండా, సూర్యుని చుట్టూ ఇతర వస్తువులైన   గ్రహాలు, కొన్ని గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు , చిన్న గ్రహాలు మరియు నక్షత్ర శకలాలు మరియు అలా తిరిగేవి ఉన్నాయి. ఈ వస్తువులు అన్నీ సూర్యుడితో కలిపి 'సౌర కుటుంబం' అంటారు. సౌర కుటుంబం యొక్క ముఖ్య భాగాలు కొన్నిటి గురించి నేర్చుకుందాము.


సూర్యుడు

సూర్యుడు ఒక నక్షత్రం, అంటే శక్తిని ఉత్పత్తి చేస్తుందని అర్ధం. విశ్వంలో చాలా చాలా నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకే ఒకటి సూర్యుడు! అది చాలా పెద్దది కాదు లేదా చాలా చిన్నది కాదు. ఇది పాలపుంత కేంద్రం నుండి చాలా దూరంగా ఉన్నది (మనం పాఠము 4లో పాలపుంత గురించి మరింత కొంచెం నేర్చుకుంటాము).ఇది ఏ విధంగానూ ప్రత్యేకం కాదు! ఏదైనా ఇతర నక్షత్రం లాగే, సూర్యుడు ఒక భారీ ద్రవ్యరాశి కలిగినది మరియు అలా ఇది సౌర కుటుంబంలో అన్ని గ్రహాలు మరియు ఇతర చిన్న వస్తువుల పైన  గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సౌర కుటుంబంలోని వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి.

 

ఇది ఒక చిన్న నక్షత్రం అయినప్పటికీ, సూర్యుడు ఎక్కువ మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మనం సూర్యుడి వలన మాత్రమే కాంతి, ఉష్ణము మరియు ఇతర రూపాలలో శక్తిని పొందుతాము. సూర్యుడి నుండి ఇంత పెద్ద మొత్తంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది? సూర్యుడు హైడ్రోజన్(1H,) తేలిక మూలకంతో చేయబడి ఉంటుంది. హైడ్రోజన్ పరమాణువుల యొక్క కేంద్రకాలు సంయోగం చెందినప్పుడు, హీలియం (2He), రెండవ అతి తేలికైన మూలకం, ఉత్పత్తి చేయబడుతుంది. హీలియం కేంద్రకం యొక్క ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణువు కన్నా కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇది ఎందుకంటే కొద్ది మొత్తంలో ద్రవ్యారాశి పెద్ద మొత్తంలో శక్తిగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియనే 'కేంద్రక సంలీనం' అంటారు. ఈ ప్రక్రియ నిరంతరంగా సూర్యుడిలో కొనసాగుతుంది ఫలితంగా సూర్యుడిపైన నిరంతరంగా విస్ఫోటనాలు జరుగుతాయి. దీని ఫలితంగా, సూర్యుడు చాలా వేడిగా ఉంటుంది (కేంద్రకంలో ఉష్ణోగ్రత సుమారుగా 1.57×107 K, ఉపరితలంలో ఉష్ణోగ్రత 5,772 K ఉంటుంది) మరియు ఇది శక్తిని విభిన్న రూపాలలో విడుదల చేస్తుంది (రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, పరారుణ, అన్ని రంగులలో దృగ్గోచర కాంతి, అతినీలలోహిత, ఎక్స్ కిరణాలు)1.

ప్రత్యేక పరికరాలను ఉపయోగించి చూసినప్పుడు2, కొన్ని సార్లు సూర్యుడి ఉపరితలంలో అకస్మాత్తుగా ఒక  ప్రకాశవంతమైన వెలుగు కనబడుతుంది. దీనినే సూర్యుడి మంట అంటారు. సూర్యుడి ఉపరితలంలో కూడా పైన మనం నల్లని మచ్చలు (సూర్యుడి మచ్చలు అంటాము) కూడా చూస్తాము. ఈ భాగాలు ఉపరితలంలో మిగిలిన వాటిలో పోల్చితే చల్లగా ఉంటుంది. సూర్యుడి వైపు సమీపంగా చూడటానికి చిత్రం 1 చూడండి.


 

చిత్రం 1: సూర్యుడిని సమీపంగా చూసినప్పుడు

U3L1_Fig1a
చిత్రం 1ఎ: ఒక సూర్యుని మంటలో ఉన్న సూర్యుడి ఉపరితలం (9 జూన్ 2002 నాడు తీసినది)
(క్రెడిట్: నాసా ద్వారా - https://solarsystem.nasa.gov/galleries/a-handle-on-the-sun)
 

U3L1_Fig1b
చిత్రం 1బి: సూర్యుని మచ్చలు (సెప్టెంబర్ 2011లో తీసినది)
(క్రెడిట్: నాసా ద్వారా - http://www.dailymail.co.uk/sciencetech/article-2042428/Best-auroras-seen-Britain-thanks-huge-solar-flares.html, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=16800815)


1నిర్దిష్ట ద్రవ్యరాశి నుండి ఉత్పత్తి అయ్యే శక్తి పరిమాణం ఐన్‌స్టీన్ యొక్క ప్రముఖ సమీకరణం ద్వారా ఇవ్వబడినది E=mc2 (ఇందులో ‘E’ అనేది ‘m’ ప్రమాణంలో ద్రవ్యరాశి నుండి ఉత్పత్తి అయిన శక్తి మరియు ‘c’ కాంతి వేగం).ఈ సమీకరణం ఎలా ఉత్పన్నం చేయబడినది మరియు ఇది ఎలా పని చేస్తుంది అని మీరు తెలుసుకోవాలంటే, మీరు అడ్వాన్స్ ఫిజిక్స్ చదవాల్సి ఉంటుంది.
2ఎన్నడూ సూర్యుడిని మీ కళ్లతో లేదా టెలిస్కోప్‌లో చూడకండి. ఇది మీ కంటిని గాయపరుస్తుంది మరియు మీరు మీ కంటి చూపుని కూడా కోల్పోవచ్చు! సూర్యుడిని పరిశీలించడానికి మనకు ప్రత్యేకమైన పరికరాలు కావాలి. జ్ఞానంతో తెలిసిన వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయండి.