×

టీచరుకి గమనిక

విద్యార్థులు ప్రయోగాలు చేయటానికి ఇష్టపడతారు. పిల్లల్ని ప్రయోగాలు చేయటానికి బహిర్గతం చేయటమే ఈ అధ్యాయం ఉద్దేశ్యం. తమ పర్యావరణం గురించి వారు గుణాత్మకమైన డేటా పొందటానికి వారు ఉపయోగించగలరు.

ప్రయోగం కోసం మీరు ఎలా తయారుచేస్తారు?

టీచర్ బల్ల రీజెంట్ బల్లలుగా

1.రీజెంట్ బల్ల-- టీచర్ బల్ల రీజెంట్ బల్లగా మారగలదు ( ఒక ప్రయోగశాలలో రీజెంట్స్ ని ఉంచే ప్రదేశం). బల్లపై కొన్ని దినపత్రికల్ని వేయాలి మరియు ఈ క్రింది క్రమంలో రీజెంట్ సీసాని ఏర్పాటు చేయాలి.

మాంగనస్ సల్ఫేట్, గంజి, సోడియం థియోసల్ఫేట్, ఆల్కలైన్ పొటాషియం లోడైడ్ మరియు ఫాస్ఫరిక్ యాసిడ్.

రసాయనాల్ని నిర్వహించేటప్పుడు విద్యార్థుల గ్రూపుని పర్యవేక్షించటానికి ఈ ఏర్పాటు మీకు సహాయపడుతుంది మరియు ప్రయోగాన్ని చేస్తున్న సమయంలో  వారు ఉపయోగిస్తున్న క్రమంలోనే  రసాయనాలు  అమర్చబడటం వల్ల  విద్యార్థులు తక్కువ తప్పులు చేస్తారు. ప్రయోగాన్ని చేసిన తర్వాత బీఓడీ సీసాల్ని ఖాళీ చేయటానికి బల్ల పై ప్లాస్టిక్ సీసాని ఉంచాలి.



ప్రయోగాల బల్లలుగా విద్యార్థుల బల్లలు
2. విద్యార్థుల బల్ల - ప్రతీ విద్యార్థి టీం ఒక డెస్క్ ని ప్రయోగ బల్లగా మార్చాలి. వారు కోరుకుంటే దినపత్రికని ఉపయోగించి డెస్క్ పై భాగాన్ని కూడా కప్పి ఉంచవచ్చు.  కాగితపు కప్పుల్లో నీటి శ్యాంపిల్ వారికి ఇవ్వాలి. టెస్ట్ ట్యూబ్  మరియు సిరంజ్  వ్యర్థపు నీటిని పడవేయటానికి మరొక కాగితపు కప్పు ని కడగాలి.



ప్రయోగం చేయటం
ఈ క్రింద ఇచ్చిన ఆక్సిజన్ ని పరీక్షించే వీడియోని విద్యార్థులంతా పరిశీలించేలా మరియు స్టెప్స్ తెలుసుకునేలా దయచేసి చర్య తీసుకోండి.  
ఇప్పుడు టీచరు విద్యార్థులకు ప్రయోగం ప్రదర్శిస్తారు మరియు ఆమె /అతని పర్యవేక్షణ క్రింద ప్రయోగం నిర్వహించటానికి వేర్వేరు టీంలని ఆహ్వానిస్తారు. ప్రతీ టీం రిజెంట్ బల్ల వద్దకు వెళ్తుంది మరియు తమ వంతు ప్రకారంగా ప్రయోగం నిర్వహిస్తుంది. ప్రతీ టీం టీచర్లకు తమ రీడింగ్స్ చూపిస్తుంది. తమ సీట్ల వద్దకు వెళ్లటానికి ముందు, ప్రతీ గ్రూపు తమ బీఓడీ సీసాలు మరియు సిరంజీలు ఖాళీ చేయాలి. 


సహజమైన జలాశయం (సరస్సు, వాగు మొదలైన వాటి నుంచి)నుంచి సేకరించిన నీటి శ్యాంపిల్ బకెట్ లో కేటాయించవచ్చు మరియు వివిధ విద్యార్థులు తీసుకువచ్చిన మరిగిన నీటిని వేరొక బకెట్ లోకి బదిలీ చేయవచ్చు. నీటి శ్యాంపిల్ తో సీసాని నింపటాన్ని టీచరు ప్రదర్శిస్తారు. ప్రతీ విద్యార్థి టీం తమ బీఓడీ సీసాని నింపుతారు మరియు ప్రయోగం చేయటానికి తమ వంతు కోసం వేచి ఉంటారు.

కావల్సిన రసాయన ద్రావణాలు

మాంగనీస్ సల్ఫేట్ ద్రావణం

మాంగనీస్ సల్ఫేట్ 48 గ్రా  (MnSO4.4H20) /20 గ్రా డిస్టిల్డ్ నీటిలో కరిగించాలి. ద్రావణాన్ని ఫిల్టర్ చేయాలి 100 మిలీ వరకు తయారు చేయాలి. ద్రావణం నీలం రంగులో ఉండకుండా జాగ్రత్తవహించాలి.

ఆల్కలైన్ అయోడైడ్ సోడియం ద్రావణం

50 గ్రా సోడియం హైడ్రోక్సైడ్ , 13.5 గ్రా సోడియం అయోడైడ్ లేదా ( 70 గ్రా పొటాషియం హైడ్రోక్సైడ్ మరియు 15 గ్రా పొటాషియం అయోడైడ్ లని) డిస్టిల్డ్  నీటిలో కరిగించాలి మరియు 100 మిలీ వరకు తయారు చేయాలి.

సోడియం థియోసల్ఫేట్ ద్రావణం

సోడియం థియోసల్ఫేట్ 1,25 గ్రా కొలవాలి మరియు డిస్టిల్డ్ నీటిలో కరిగించాలి మరియు 100 మిలీ వరకు తయారు చేయాలి. భద్రపర్చటానికి 1 గ్రా సోడియం హైడ్రోక్సైడ్ చేర్చాలి. 

స్టార్చ్ ఇండికేటర్

2 గ్రా గంజిని 50 మిలీ వేడి డిస్టిల్డ్  నీటిలో కరిగించాలి. (మీరు భద్రపరుస్తుంటే  0.1 గ్రా సాలిసైలిక్ యాసిడ్ చేర్చాలి)

ఫాస్ఫరిక్ యాసిడ్ (90 శాతం)

 

 

 

 

[Contributed by administrator on 10. Januar 2018 21:33:24]

×