clix - Atom in Chemistry
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Atom in Chemistry

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

మీరు ఈ మాడ్యూల్ గురించి ఏమనుకుంటున్నరో తెలియచేయండి

మీరు ఈ మాడ్యూల్ గురించి ఏమనుకుంటున్నరో తెలియచేయండి

ఇప్పుడు మీ కంప్యూటర్లో ఈ సర్వేని నింపండి. ఒకరి తర్వాత ఒకరు, మీ సొంతంగా కానీ, అవసరమైతే మీ కంప్యూటర్ ఫ్రెండ్ సహాయంతో కానీ దీనిని నింపాలి. ఈ సర్వే మీరు ఇప్పుడే పూర్తి చేసిన CLix మాడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని నింపండి.  మీరు ప్రతీ వాక్యాన్ని చదివినప్పుడు, దానితో మీరు ఎంత వరకు ఒప్పుకుంటారో లేదా ఒప్పుకోరో అన్నది ఆలోచించుకోవాలి. ఈ వాక్యాలు బాలబాలికలు ఇద్దరకూ(రెండు లింగాలకూ) వర్తిస్తాయి. మీరు ప్రతీ వాక్యాన్ని జాగ్రత్తగా, మీ లింగానికి తగినట్లుగా చదవాలి. ఇందులో  సరియైన లేదా తప్పు జవాబులు లేవు (తప్పొప్పులు లేవు).  ఇంకా, మీ జవాబులను స్కూలుకి సంబంధించిన ఎవ్వరూ చూడరు.

సర్వేలో విభిన్న రకాల వాక్యాలు ఉన్నాయి. మీరు వివిధ విషయాల గురించి ఏమనుకుంటున్నారో చెప్పే వాక్యాలు కొన్ని ఉన్నాయి. అవి మీకు ఎంత వరకు వర్తిస్తాయో మీరు నిర్ణయించాలి.  ఉదాహరణకు, ఒక వాక్యం ఇలా ఉంటుంది, "ఈ మాడ్యూల్ చేయడం బోరింగా(విసుగుగా) ఉంది." మాడ్యూల్ చేయడం మీకు చాలా బోరింగా ఉంటే, మీరు సంఖ్య 5ని గుర్తు పెట్టాలి, అంటే ఆ వాక్యంతో మీరు పూర్తి ఒప్పుకుంటారు  అని అర్థం. మాడ్యూల్ చేయడం మీకు అస్సలు బోరింగా లేకపోతే, మీరు సంఖ్య 1ని గుర్తు పెట్టాలి, అంటే ఆ వాక్యంతో మీరు అస్సలు ఒప్పుకోరని అని అర్థం. మీ భావన “ఇది చాలా బోరింగా ఉంది” మరియు “ఇది అస్సలు బోరింగా లేదు” మధ్య ఎక్కడైనా ఉంటే, మీరు అనుకునేదానికి దగ్గర ఉండే సంఖ్యను గుర్తు పెట్టండి. ఉదాహరణకి, మాడ్యూల్  కొంత బోరింగా ఉండి,  కానీ మీరు ఇప్పటి వరకూ చేసిన వివిధ కృత్యాలతో పోలిస్తే అత్యంత   బోరింగా అయితే లేదని మీరు అనుకుంటే, మీరు 4ని లేదా 3ని కూడా గుర్తు పెట్టవచ్చు, అంటే మీరు వాక్యంతో ఒప్పుకుంటారు  కానీ పూర్తి స్థాయిలో అయితే కాదు అని అర్థం.

కొన్ని వాక్యాలు ఫలాన విషయం మంచిదని చెబుతూ, అది ఎందుకు మంచిదో అన్న కారణం కూడా చెబుతాయి. ఈ సందర్భంలో, మీరు వాక్యంలోని రెండు భాగాలతోనూ అంగీకరిస్తారా లేదా అన్నది ఆలోచించాలి. మీరు రెండు భాగాలతోనూ గట్టిగా అంగీకరిస్తే, 5ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, ఒక వాక్యం - "ఈ మాడ్యూలు నా సబ్జెక్టు నేర్చుకోవడానికి సహాయపడగలదు, అందుకని ఇది నాకు ఎంతో ముఖ్యమైనది” - అని ఉంది. మీరు ఈ మాడ్యూలు చాలా మంచిదని, అది మీరు సబ్జెక్టు నేర్చుకోవడానికి చాలా సహాయపడిందని భావిస్తే, ఈ వాక్యానికి సమాధానం ఇవ్వడానికి మీరు 5ని ఎంచుకోండి. మీరు ఈ మాడ్యూలు మంచిదని, అయితే అది మీరు సబ్జెక్టు నేర్చుకోవడానికి ఒక కొంతే సహాయపడిందని భావిస్తే, మీరు 4ని ఎంచుకోండి. ఒక వేళ ఈ మాడ్యూలు సబ్జెక్టు నేర్చుకోవడానికి కాకుండా కేవలం మీరు కంప్యూటర్ ల్యాబుకు వచ్చేందుకు మాత్రమే ఉపయోగపడితే, మీరు 1ని కానీ, 2ని కానీ ఎంచుకోవాలి - మీరు వాక్యంలో ఇచ్చిన కారణంతో (‘ఈ మాడ్యూలు సబ్జెక్టు నేర్చుకోవడానికి సహాయపడగలదు’ అనేదానితో) అంగీకరించరని దీని అర్ధం.

ఇతర వాక్యాలు మీరు చేసిన విషయాల గురించి ఆలోచించమని అడుగుతాయి. ఉదాహరణకు, ఒక వాక్యం "ఈ మాడ్యూల్లోని కృత్యాలు పూర్తి చెయ్యడానికి నేను, నా తోటి విద్యార్థులు కలిసి పనిచేసాము" అని ఉంటుంది. ఈ సందర్భంలో 1 నుండి 5 మధ్య అంకెలు మీరు మీ స్నేహితులతో ఎంతవరకు కలిసి పనిచేసారో అన్నదానికి సంబంధించినవి. ఒక వేళ మీరు, మీ తోటి విద్యార్థులు మాడ్యూల్లో ఇచ్చిన కృత్యాలు గురించీ, అడిగిన ప్రశ్నలకు జవాబులు గురించీ ఒకరితో ఒకరు చర్చించుకుని అభిప్రాయాలు, సలహాలు పంచుకున్నట్లైతే, మీరు 5ని ఎంచుకోవాలి. అంటే, మీరు కలిసి పని చేసారనే వాక్యంతో మీరు గట్టిగా ఒప్పుకుంటున్నారని అర్థం. ఒక వేళ మీరు, మీ తోటి విద్యార్థులు మాడ్యూల్ పై పని చేస్తున్నప్పుడు అస్సలు కలిసి పనిచేయకపోతే - అంటే మీరు ఒక కంప్యూటర్ పంచుకున్నారు, కానీ మాడ్యూల్లో ఇచ్చిన కృత్యాలు గురించి గానీ, జవాబులు గురించి గానీ ఏమీ చర్చించుకోపోతే - అప్పుడు మీరు 1ని గుర్తు పెట్టాలి, అంటే వాక్యంతో మీరు అస్సలు ఒప్పుకోరని అర్థం.

మీరు ఇప్పుడు ఈ  CLIx మాడ్యూ లో యాక్టివిటీలు(కృత్యాలు) చేసి ఉన్నారు. దీని బట్టి  మీరు ఈ కింది వాక్యాలతో ఎంత వరకు అంగీకరిస్తారో లేదా ఎంత వరకు అంగీకరించరో తెలుపండి (Q.8 - Q.27). వీటికి సమాధానం ఇవ్వడానికి మీరు CLIx లో ఇప్పుడే పూర్తి చేసిన మాడ్యూలు గురించి మాత్రమే ఆలోచించి ఆప్షన్లు ఎంచుకోండి.

[Contributed by administrator on 10. Januar 2018 21:13:34]