clix - Unit 2: The Moon
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Unit 2: The Moon

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

కార్యకలాపం 2: చంద్రుడి యొక్క వాలుగా ఉన్న కక్ష్య (ఊహ)

గ్రహణములు

మనం కార్యకలాపం 1 చేస్తుండగా, మీరు చంద్రుడి నమూనాని మీ తల పైకి కొంచెం ఎత్తుగా పట్టుకోవడం లేదా సూర్యుడి నుండి కాంతిని అడ్డుకోకుండా కొద్దిగా వంగడం గుర్తుండవచ్చు. భూమి సూర్య కాంతిని అడ్డుకుంటుందా లేదా అడ్డుకోదా? అది అడ్డుకుంటే, మనం పౌర్ణమిని ఎలా చూస్తాము?

సరే, చాలా సమయం ఇది కాంతిని అడ్డుకోదు ఎందుకంటే చంద్రుడి కక్ష్య భూమి యొక్క కక్ష్యా తలంలో లేదు. చంద్రుడి కక్ష్యా తలం భూమి యొక్క కక్ష్యా తలంతో 5° కోణం చేస్తుంది. చిత్రం 3 భూమి- చంద్రుడు- చంద్ర కుటుంబం యొక్క వాలుగా ఉన్న వీక్షణని చూపుతుంది. స్థితి ఎ వద్ద భూమి చూపబడినది మరియు చంద్రుడి యొక్క కక్ష్య యొక్క రెండు స్నాప్ షాట్స్ ఎ మరియు బి వద్ద చూపబడినాయి (స్పష్టత కొరకు భూమి స్థితి బి వద్ద చూపబడలేదు) ఏదైనా ఇవ్వబడిన సమయంలో చంద్రుడి ఒక్క కక్ష్య 5°  కోణం చేస్తుందని, మీరు చూస్తారు.కావున చంద్రుడు మరియు సూర్యుడు భూమికి ఒక వైపున ఉన్నప్పటికీ లేదా భూమికి ఖచ్చితంగా ఇరువైపులా ఉన్నప్పటికీ సూర్యుడు-భూమి రేఖ మరియు భూమి- చంద్రుడి రేఖ మధ్య కోణం 0° మరియు 5° మధ్య మారవచ్చు. ఒక కార్యకలాపంతో దీనిని మరింత అర్ధం చేసుకుందాము.

ప్రక్రియ:

  1. భూమి మీ తల అని ఊహించుకోండి. సూర్య కిరణాలు వస్తున్న దిశ నుండి దిశలలో ఒక దానిని స్థిరంగా ఉంచండి.
  2. భూమి చుట్టూ చంద్రుడి కక్ష్యని మీ చాచిన చేయి ఉపయోగించి గీయండి. మీరు దీనిని చాలా విధాలుగా చేయవచ్చు.

I. చంద్రుడు మరియు సూర్యుడు భూమికి ఒకే వైపులో ఉన్నప్పుడు (స్థితి ఎలో చూపినట్లు) భూమి-చంద్రుడి రేఖతో సూర్యుడు భూమి రేఖ ఖచ్చితంగా 5°కోణం చేసేట్లు చంద్రుడి కక్ష్య వాలుగా ఉండాలి. ఇక్కడ మీ చేయి సూర్యుడు ఉన్న వైపులో చంద్రుడు ఉండటాన్ని బట్టి లేదా సూర్యుడి నుండి ఖచ్చితంగా ఎదురుగా ఉన్న దానిని బట్టి ఎత్తులో లేదా తక్కువ స్థితిలో ఉంటుంది. కాంతి అడ్డుకోబడదు మరియు ఎటువంటి నీడలు ఉండవు. సూర్యుడికి అవతలి వైపు చంద్రుడు ఉన్నప్పుడు మనం పౌర్ణమి చూస్తాము.


II. స్థితి బిలో చూపినట్లు, సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే రేఖపైన ఉండేట్లు చంద్రుడి కక్ష్య వాలుగా ఉండవచ్చు. ఇక్కడ మీ చేయి సూర్యుడు ఉన్న వైపున లేదా సూర్యుడికి అవతలి వైపున చంద్రుడు ఉన్నా మీ తల ఎత్తులో ఉండవచ్చు మరియు అది సూర్య కిరణాల దిశకి లంబంగా ఉన్నప్పుడు అది చాలా ఎత్తులో లేదా చాలా తక్కువ స్థితిలో ఉండవచ్చు. ఈ సందర్భంలో, చంద్రుడు పౌర్ణమి స్థితిలో ఉన్నప్పుడు భూమి కాంతిని అడ్డుకుంటుంది మరియు భూమి యొక్క నీడ చంద్రుడి పైన పడుతుంది.
 

Moon
చిత్రం 3: చంద్రుడి యొక్క కక్ష్య భూమి యొక్క కక్ష్యతో 5° కోణం చేస్తుంది.

III. చంద్రుడి కక్ష్య యొక్క ఇతర స్థితుల వద్ద, సూర్యుడు మరియు చంద్రుడు భూమికి ఒక వైపున ఉన్నప్పటికీ లేదా భూమికి ఖచ్చితంగా ఇరువైపుల ఉన్నప్పుడు, సూర్యుడు-భూమి రేఖ మరియు భూమి- చంద్రుడి రేఖ మధ్య కోణం 0°  మరియు 5° మధ్య మారవచ్చు.


అలా, చాలా సమయాలలో చంద్రుడు సూర్యుడు మరియు భూమిని కలిపే రేఖకు కొద్దిగా పైన లేదా కొద్దిగా క్రింద వెళుతుంది మరియు అందువలన, అది సూర్య కాంతితో వెలుగుతుంది. కానీ కొన్ని సార్లు, సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒక సరళ రేఖలో ఉండేట్లు కక్ష్యా ఆధారంగా ఉంటుంది (స్థితి బి).ఈ సమయంలో, భూమి సూర్య కాంతిని అడ్డుకుంటుంది మరియు చంద్రుడి పైన నీడ పడేట్లు చేస్తుంది.ఈ అరుదైన సమయాలలో, చంద్రుడు పూర్తిగా చీకటిగా ఉంటాడు. భూమికి అవతలి వైపున ఉన్న అర్ధ చంద్రుడు కూడా భూమికి అవతలి వైపున ఉంటుంది మరియు కావున సూర్యకాంతికి లోనవదు. భూమి మరియు సూర్యుడి వైపు సగం భూమి యొక్క నీడలో ఉన్నది. ఈ సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది.(లునా అనేది ఒక లాటిన్ పదం, దీని అర్ధం చంద్రుడు)చంద్ర గ్రహణం చూసే అవకాశం మీకు ఉంటే దానిని చూడటం మరవకండి! చంద్రుడి పైన భూమి నీడ నిదానంగా కదిలే ఒక సుందర దృశ్యం. ఆసక్తికరంగా, అరిస్టాటిల్ అనే ఒక ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్త, భూమి గోళాకారంగా ఉన్నది ఒక రుజువును ప్రతిపాదించాడు. భూమి ఏదైనా ఇతర ఆకారంలో ఉంటే, అది ప్రతి సారి ఒక గోళాకార నీడని ఏర్పరచలేదు. ఆ సమయంలో చాలా మంది భూమి ఒక డిస్క్ ఆకారంలో ఉందని నమ్మేవారు. డిస్క్ ఎల్లప్పుడూ ఒక గుండ్రని నీడని ఏర్పరుస్తుందా? దానిని ప్రయత్నించండి!

 

కొన్నిసార్లు, సూర్యుడు- భూమి మరియు భూమి-చంద్రుడు రేఖ మధ్య కోణం సున్నా కాదు కానీ చంద్రుడి యొక్క కొంత భాగంలో మాత్రమే భూమి యొక్క నీడ పడుతుంది. దీనిని పాక్షిక సూర్య గ్రహణం అంటారు (చిత్రం 4).
 


U2L2_Fig4_Eclipse
చిత్రం 4: పౌర్ణమి, సంపూర్ణ చంద్రగ్రహణం మరియు పాక్షిక చంద్ర గ్రహణం


కార్యకలాపం 1 చేస్తున్నప్పుడు, అమావాస్య సమయంలో సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు రావడం మీకు గుర్తు చేసుకోవచ్చు. పౌర్ణమి స్థితి లాగే, చంద్రుని యొక్క వాలుగా ఉన్న కక్ష్య వలన ఇది తరచుగా సంభవించదు. కానీ ఇది సంభవించితే, చంద్రుడు సూర్యుని అడ్డుకుంటుంది మరియు మనం సూర్య గ్రహణం చూస్తాము. మూడు రకాల సూర్య గ్రహణాలు ఉన్నాయి (చిత్రం 5లో చూపబడినాయి)

  1. సంపూర్ణ సూర్య గ్రహణం: సూర్యుడిని పూర్తిగా చంద్రుడు అడ్డుకుంటుంది
  2. పాక్షిక సూర్య గ్రహణం: సూర్యుడిలో కొంత భాగాన్ని మాత్రమే చంద్రుడు అడ్డుకుంటుంది
  3. వలయాకార సూర్య గ్రహణం: సూర్యుని యొక్క బయటి వలయం కనిపించేట్లు ఉంచి, లోపలి వలయాన్ని మాత్రమే చంద్రుడు అడ్డుకున్నప్పుడు వలయం కనిపిస్తుంది
చిత్రం 5: భూమి నుండి చూసినప్పుడు సూర్య గ్రహణం

Total
చిత్రం 5a: 1999లో ఫ్రాన్స్ నుండి తీసిన సంపూర్ణ సూర్య గ్రహణం.

క్రెడిట్:ఐ, లుక్ వియాటూర్ ద్వారా, సిసి బివై- ఎస్ఎ 3.0 https://commons.wikimedia.org/w/index.php?curid=1107408


Partial
చిత్రం 5b: అక్టోబర్ 23, 2014 నాడు మినియాపోలిస్, యు ఎస్ ఎ నుండి తీసిన పాక్షిక సూర్య గ్రహణం

క్రెడిట్:టోమ్రుయెన్ ద్వారా - ఒవున్ వర్క్, సిసి బివై-ఎస్ఎ 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=36349192


Annular
చిత్రం 5c: మే 20, 2012 నాడు నేవాడ, యు ఎస్ ఎ నుండి తీసిన వలయాకార సూర్య గ్రహణం

మూలం: https://commons.wikimedia.org/wiki/File:Annular_Eclipse._Taken_from_Middlegate,_Nevada_on_May_20,_2012.jpg (CC BY-SA 3.0)

 

సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుందో వివరించే ఒక చిత్రాన్ని గీయండి.

 
 
[Contributed by administrator on 10. Januar 2018 21:22:21]