clix - Unit 1: The Earth
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Unit 1: The Earth

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

హోరిజోన్

మనం ఒక సముద్రం ఒడ్డుకి లేదా సమీపంలో పెద్ద భవనాలు లేని ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మనం భూమిలో భాగాన్ని ఒక డిస్క్ లాగా మరియు దాని పైన ఆకాశం కప్పులాగా చూస్తాము. మన చుట్టూ ఒక ఊహాజనిత వృత్తాకార రేఖ నేల మరియు ఆకాశాన్ని వేరుపరుస్తుంది మనం దీనిని హోరిజోన్ అంటాము. భూమి నుండి ఆకాశం యొక్క చాలా పరిశీలనల కొరకు రెఫరెన్సు గీతగా మనం హోరిజోన్‌ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, సూర్యుడు లేదా ఏదైనా ఖగోళ వస్తువు హోరిజోన్ పైన కనిపిస్తే మనం అది 'ఉదయించింది' అని అంటాము. ఖగోళ శాస్త్రవేత్తలు కూడా హోరిజోన్ నుండి దిశతో (ఉత్తరం/దక్షిణం/తూర్పు/పశ్చిమ) సహా ఒక నక్షత్రం లేదా ఖగోళ వస్తువు కనిపించే కోణాన్ని తెలుపుతారు ఉదాహరణకి, ఒకరు ఈ రోజు రాత్రి 8 గంటలకు చంద్రుడు హోరిజోన్ తూర్పున 30 డిగ్రీలలో పైన కనిపిస్తుందని అనవచ్చు. జెనిత్, హోరిజోన్ నుండి అన్ని వైపుల నుండి తలపైన ఖచ్చితంగా 90 డిగ్రీలు చేసే బిందువు.

 

భూమి పైన నిలబడిన ఒక వ్యక్తి కొరకు హోరిజోన్‌ ని ఎలా నిర్ణయించవచ్చో చూద్దాము.


ఒక వ్యక్తి గోళాకార భూమి పైన నిలబడ్డారని అనుకుందాము. అతను ఎంత వరకు చూడగలడు? అతని కంటి నుంచి గీచిన స్పర్శరేఖల మధ్య ఉన్న భూమిలో భాగాన్ని చూడగలడు. మానవుడితో పోల్చితే భూమి చాలా పెద్దది అని మనం ఇప్పుడే చూసాము; కావున వ్యక్తి యొక్క ఎత్తు తగ్గిద్దాము(బి); ఇప్పుడు అతను ఎంత వరకు చూడగలడు? భూమి యొక్క వ్యాసార్ధం పెంచినప్పుడు స్పర్శరేఖల మధ్య కోణానికి ఏమి జరుగుతుంది? రేఖల మధ్య కోణం పెరిగింది.
 


U1L1_Fig3
చిత్రం 3:హోరిజోన్

 

 

భూమి వ్యాసార్ధం 64,00,000 మీటర్లు మరియు పొడవైన వ్యక్తి యొక్క ఎత్తు 2 మీటర్లు. కావున మనం భూమి పైన ఒక బిందువు లాగా ఉండమా (సి)? ఈ సందర్భంలో దృష్టి యొక్క రేఖల మధ్య కోణం ఎంత ఉంటుంది? మనం దానిని 180o అనుకుందామా? వ్యక్తి నిలబడిన బిందువు నుండి అది ఒక స్పర్శ రేఖ మాత్రమే.

 

మీరు ఒక సముద్ర తీరం లేదా చాలా సమాంతరంగా ఉన్న ఒక ప్రదేశంలో వెళ్ళి ఉంటారు. మీరు చుట్టూ చూస్తే, మీరు కొద్దిగా ఉబ్బిన డిస్క్ పైన నిలబడినట్లు భావిస్తారు. డిస్క్ కొస దాదాపు వృత్తాకారంగా కొన్ని చెట్లు మరియు ఇతర వస్తువులు కొంత సమానంగా లేకుండా ఉంటుంది. నేల పైన ఈ వృత్తాకార డిస్క్ అంచు లేదా మనం చూసే నేల లేదా వస్తువులకి రేఖని హోరిజోన్ అంటాము. కావున ఇకపై, చిత్రంలో స్పర్శరేఖని 'హోరిజోన్ రేఖ' అంటాము.


ఇప్పుడు ఒక నావికుడు తన నావలో ప్రయాణం చేస్తున్నాడని అనుకుందాము (చిత్రం 4). హోరిజోన్ ఎలా మారుతుంది మరియు అతను ప్రయాణం చేస్తుండగా ఆకాశంలో నక్షత్రాల స్థితి ఎలా మారతాయో చూడండి. ఒక్కో స్థితి నుండి ఏ నక్షత్రాలు నావికుడికి కనిపిస్తాయి? ఇంకా, వాటిలో హోరిజోన్‌కి సమీపంగా ఉన్నవి ఏవి మరియు జెనిత్‌కి ఏది సమీపంగా ఉన్నదో సరి చూడండి?
 

U1L1_Fig4
చిత్రం 4:ఆకాశంలో విభిన్న భాగాలు భూమిలో విభిన్న ప్రదేశాల నుండి కనిపిస్తుంది

భూమి పైన విభిన్న ప్రదేశాల లోని వ్యక్తులు ఆకాశంలోని విభిన్న భాగాలను చూస్తారు. అందుకే, ఒక ప్రదేశంలో ప్రజలు సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నట్లు , ఇంకొక ప్రదేశంలో మధ్యాహ్నం, ఇంకా ఇంకొక ప్రదేశంలోని వ్యక్తులు సూర్యాస్తమయాన్ని మరియు ఇంకొక ప్రదేశం లోని వ్యక్తులు సూర్యుడు ఇంకా ఆకాశంలో కనిపించకుండా, చీకటి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తూ ఉండటం చూస్తారు. ఏదైనా ఇవ్వబడిన సమయంలో, సూర్యుడు (హోరిజోన్ పైన) భూమిలో సగభాగం కనిపిస్తుంది మరియు భూమిలోని ఆ భాగానికి అది పగలు అవుతుంది. భూమి పైన మిగిలిన భాగం, సూర్యుడు కనిపించదు మరియు అది భూమిలోని భాగానికి 'రాత్రి' అవుతుంది. ఇంకా, చిత్రం 5 లో, ఎ, బి మరియు సి వ్యక్తులకు మధ్యాహ్నం అయినప్పటికీ, వ్యక్తి ఎకి మాత్రమే సూర్యుడు నేరుగా తలమీద (జెనిత్ మీద) ఉన్నది. ఇది వ్యక్తి బి కొరకు జెనిత్‌కి దక్షిణంగా ఉన్నది మరియు వ్యక్తి సి కొరకు, ఇది జెనిత్‌కి ఉత్తరం వైపు ఉన్నది. అలా, సూర్యుడు ప్రతి ఒక్కరికీ మధ్యాహ్నం తల మీద రాదు. రేపు మీ ప్రదేశంలో సూర్యుడు తల పైన ఉంటుందేమో సరి చూడండి.



U1L1_Fig5
చిత్రం 5:భూమి పైన ప్రతి ప్రదేశం నుండి సూర్యుడు మధ్యాహ్నం జెనిత్ వద్ద ఉండదు

 

చిత్రం 5లో, సూర్య కిరణాలు సమాంతరంగా లేవని మీరు గమనించి ఉంటారు. ఇది మనం చేసే ఒక ముఖ్యమైన అంచనా. సూర్యుడు గోళాకారంలో ఉంటుంది; దీని కిరణాలు అన్ని దిశలలో వెళతాయి. కానీ సూర్యుడు భూమి నుండి చాలా దూరంలో (దాదాపు 150 మిలియన్ కిమీ) ఉన్నది. కావున భూమి పైన పడే ఏవైనా రెండు కిరణాల మధ్య కోణం చాలా చిన్నగా, ఆచరణాత్మకంగా సున్నా అవుతుంది. అందుకే భూమి పైన పడే సూర్య కిరణాలు సమాంతరం అని మనం పరిగణిస్తాము.


ఈ పాఠంలో, భూమి గోళాకారంగా ఉన్నదని మరియు మనం దాని ఉపరితలం అంతటా నివసిస్తామని నేర్చుకున్నారు. మీరు హోరిజోన్, మిగిలిన పాఠాలలో చాలా వాటిలో ఉపయోగించిన భావన గూర్చి కూడా మీరు నేర్చుకున్నారు. మనం నేర్చుకున్న ఇంకొక ముఖ్యమైన ఉజ్జాయింపు భూమి పైన పడే సూర్య కిరణాలు సమాంతరంగా పరిగణించాలి. తరువాతి మూడు పాఠాలలో, భూమి యొక్క భ్రమణం మరియు పరిభ్రమణం గురించి మరియు వాటి ఫలితాల గురించి కొంత వివరంగా తెలుసుకుంటారు. పాఠాలు 5 నుంచి 8లో, మీరు చంద్రుడి : అది ఎలా కదులుతుంది మరియు దాని ఫలితం ఏమిటి, మనం ఏది చూస్తామో గురించి నేర్చుకుంటారు. పాఠాలు 9 నుండి 12 లో మన సౌర కుటుంబం గురించి మరియు దానికి మించి విశ్వం గురించి నేర్చుకుంటారు. అంతరిక్షం గుండా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి!


 

[Contributed by administrator on 10. Januar 2018 21:24:03]