clix - Unit 1: The Earth
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Unit 1: The Earth

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

కార్యకలాపం 2: ఒక సంవత్సరంలో సూర్యుడి మార్గంలో మార్పులు(ఊహ)

ఋతువులు

క్రింది ప్రశ్నలకు నువ్వు జవాబు ఇవ్వగలవా?

  1. ‘ఋతువు’?

  2. ఇండియాలో మనకు ఉండే ఋతువులు ఏవి?

  3. వేసవి కాలం, వర్షాకాలం మరియు చలికాలం మధ్య బేధాలు వ్రాయండి.

  4. భూమి పైన ఎక్కడైనా ఋతువులు (ప్రత్యేకంగా వేసవి కాలం మరియు చలికాలం) ఉంటాయా?

  5. ఇండియాలో వేసవి కాలం ఉంటే ప్రపంచంలో ప్రతి చోట వేసవి కాలం ఉంటుందని అనుకున్నావా? లేదు అయితే, ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలలో ఋతువులు వేరుగా ఎలా ఉంటాయి?

  6. భూమి పైన మనకు ఋతువులు ఎందుకు ఉన్నాయి?

ఒక సంవత్సరంలో వాతావరణం, జీవావరణం మరియు పగటి సమయం పరిమాణంలో మార్పుల ద్వారా గుర్తించబడే భాగమే ఒక ఋతువు. ఇండియాలో సాధారణంగా సంవత్సరాన్ని మూడు ఋతువులుగా విభజిస్తాము: వేసవికాలం, వర్షాకాలం మరియు శీతాకాలం. సగటుగా, వేసవి కాలాలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది మరియు శీతాకాలంలో తక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో వర్షాలు వస్తాయి. వర్షాకాలం ఉష్ణ మండల ప్రాంతాలకు, ప్రత్యేకంగా దక్షిణ ఆసియాలకి (ఇండియా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ మొదలగు వాటికి) ప్రత్యేకమైనది మరియు దీని ఇంగ్లీషు పేరు 'మాన్‌సూన్' ‘మౌసమ్’ అనే హిందీ పదం నుండి గ్రహింపబడినది. వేసవి కాలం మరియు శీతా కాలం, అయినప్పటికీ, ప్రపంచం అంతా ఉంటుంది. మీరు నీటి వలయం గురించి మరియు వర్షాలు ఎలా కురుస్తాయో మీరు నేర్చుకునే ఉంటారు. ఇప్పుడు మనకు వేసవి కాలం మరియు శీతాకాలం ఎందుకు ఉన్నాయో నేర్చుకుందాము.

మనం కొనసాగడానికి ముందు, వేసవి కాలం మరియు శీతాకాలం ఎలా సంభవిస్తాయి అని అలోచిద్దాము. సంవత్సరంలో ఒక భాగంలో వేడిగా  మరియు ఇంకొక భాగంలో ఎందుకు చల్లగా ఉంటుందో మీరు ఆలోచించారా?
 

ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి:

I. పగలు మరియు రాత్రి వ్యవధిలో అంతరం: వేసవి కాలంలో సూర్యుడు ముందుగానే ఉదయించి మరియు తరువాత ఆలస్యంగా అస్తమిస్తాడని, కానీ శీతాకాలంలో ఆలస్యంగా ఉదయించి మరియు త్వరగా అస్తమిస్తాడని మీరు గమనించారా? ప్రభావితంగా, మనకు శీతాకాలం కన్నా వేసవి కాలంలో ఎక్కువ సమయం సూర్యకాంతిని పొందుతాము. సూర్యుడు శీతాకాలంలో చిన్ని చాపమును మరియు వేసవి కాలంలో పెద్ద చాపమును అనుసరిస్తాడు (చిత్రం 2).
 
Changes

చిత్రం 2: కర్కాటక రేఖ పైన ఒక సంవత్సరంలో సూర్యుడి మార్గంలో మార్పులు


కార్యకలాపం 2: ఒక సంవత్సరంలో సూర్యుడి మార్గంలో మార్పులు(ఊహ)

ప్రక్రియ:

  1. మీ తరగతి గదిలో ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ దిశలను కనుగొనండి.

  2. తూర్పు నుండి పడమరకు మీ చేతిని కదిలించడం ద్వారా వివిధ కాలాలలో ఆకాశంలో సూర్యుని యొక్క స్పష్టమైన మార్గంను అనుకరించండి. మనం ఉత్తర అర్ధ గోళంలో ఉన్నాము కావున, సూర్యుడు ఎల్లప్పుడూ ధృవ రేఖకి దక్షిణం వైపుకు ఉంటాడు. సూర్యుడు కర్కాటక రేఖకి క్రింద రెండు సార్లు మాత్రమే తల పైన ఉంటాడు. కావున 23.50°  పైన ఏదైనా అక్షాంశం ఎల్లప్పుడూ జెనిత్‌కి దక్షిణంగా ఉంటుంది.

II. సూర్య కాంతి తీవ్రతలో (బలం) మార్పు: వేసవి కాలంలో, సూర్యుడు ఆకాశంలో మధ్యాహ్నం చాలా ఎత్తులో ఉన్నట్లు కనిపించడం మీరు గమనించి ఉండవచ్చు. శీతాకాలంలో, అయితే, సూర్యుడు మధ్యాహ్నంలో కూడా చాలా తక్కువగా ఉంటాడు (చిత్రం 2 చూడండి).సూర్యుడి యొక్క కిరణాలు ఉపరితలానికి లంబంగా ఉన్నప్పుడు తీవ్రత గరిష్టంగా ఉంటుంది. క్రింది ఉదాహరణ ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. వర్షం పడుతున్నది మరియు ఒక డబ్బాలో మీరు వర్షపు నీటిని సేకరించాలని అనుకున్నారని అనుకుందాము. మీరు డబ్బాని ఎలా పట్టుకుంటారు? వర్షపాతానికి లంబంగా (చిత్రం 3ఎ) లేదా కొంత కోణంలోనా(చిత్రం 3బి)?మీరు డబ్బాని వర్షపాతానికి లంబంగా (చిత్రం 3ఎ లో చూపినట్లు) లంబంగా పట్టుకుంటే మీరు గరిష్ట మొత్తంలో నీటిని సేకరిస్తారు. కోణం తగ్గుతున్న కొద్దీ, సేకరించే నీటి మొత్తం తగ్గుతుంది. వర్షపాతానికి సమాంతర దిశలో (చిత్రం 3సి లో చూపినట్లు) మీరు డబ్బాని పట్టుకుంటే , నీరు సేకరించబడదు.

Intensity
చిత్రం 3: తీవ్రత పతన కోణాన్ని బట్టి ఉంటుంది

 

ఇది సూర్య కిరణాలకు కూడా ఒకే లాగా ఉంటుంది. వేసవి కాలంలో, సూర్య కిరణాలు మరియు భూమి ఉపరితలం (నేల) మధ్య కోణం అధికంగా ఉంటే, భూమి యొక్క ఆ భాగంలో మరింత సూర్యకాంతి పడుతుంది. శీతాకాలంలో, సూర్య కిరణాలు మరియు భూమి ఉపరితలం (నేల) మధ్య కోణం అల్పంగా ఉంటే, భూమి యొక్క ఆ భాగంలో తక్కువ సూర్యకాంతి పడుతుంది.

అందుకే ఉష్ణోగ్రతలు వేసవి కాలంలో అధికంగా మరియు శీతాకాలంలో తక్కువగా ఉంటాయి. ఇప్పుడు సంవత్సర కాలంలో సూర్యుడి మార్గం ఎందుకు మారుతుంది?

భూమి భ్రమణం చేసే అక్షం 23.5° డిగ్రీలు వాలుతో వంపబడినది. అలా, భూమి యొక్క అక్షం భూమి యొక్క కక్ష్యా తలంతో 66.5° డిగ్రీలు కోణాన్ని చేస్తుంది. అది ధృవ నక్షత్రం దిశ వైపు ఉంటుందని, మీకు తెలిసినదే. ధృవ నక్షత్రం చాలా దూరంగా (433 కాంతి సంవత్సరాల కన్నా ఎక్కువ) ఉన్నది; కావున కక్ష్యలో ఎక్కడైనా అక్ష దిశ ఒకే లాగా ఉండిపోతుంది.

 

Telugu_U1L3_Fig4

చిత్రం 4: భూమి యొక్క అక్షం తన కక్ష్యా తలానికి 66.50 కోణం చేస్తుంది


ఉత్తర ధృవం సూర్యుడి (మరియు దక్షిణ ధృవం సూర్యుడి నుండి దూరంగా ఉన్నది) వైపు వాలుగా ఉన్నప్పుడు, అంటే, చిత్రంలో స్థితి బి వద్ద, సూర్య కిరణాలు కర్కాటక రేఖ పైన లంబంగా పడతాయి (చిత్రం 5 చూడండి). సూర్యకిరణాల యొక్క సంభవన కోణం దక్షిణ అర్ధ గోళంలో కంటే ఉత్తర అర్ధగోళంలో తక్కువగా ఉంటుంది(ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ వద్ద 0°). ఇంకా, దక్షిణ అర్ధ గోళం కన్నా ఉత్తర అర్ధ గోళంలో పగలు ఎక్కువ సమయం ఉంటుంది. ఈ చివరి స్థితిలో, ఉత్తర అర్ధ గోళంలో పగలు చాలా ఎక్కువ సమయం సుమారుగా జూన్ 21 నాడు సంభవిస్తుంది మరియు 'జూన్ అయనాంతం (జూన్ సోల్‌స్టైస్)' అంటారు.


ఈ స్థితిలో (ఈ స్థితికి మూడు నెలల ముందు అంటే 20 మార్చ్ నుండి ఈ స్థితి తరువాత మూడు నెలలకు అంటే, 23 సెప్టెంబర్ వరకు) ఉత్తర అర్ధ గోళంలో పగలు సమయం 12 గంటల కన్నా ఎక్కువ ఉంటుంది. కావున, ఈ అవధిలో, ఉత్తర అర్ధ గోళంలో వేసవి కాలం మరియు దక్షిణ ధృవంలో శీతాకాలం ఉంటుంది.

 

June
చిత్రం 5: జూన్ ఆయనాంతం


 

దక్షిణ ధృవం సూర్యుడి వైపు వాలుగా ఉన్నప్పుడు మరియు ఉత్తర ధృవం సూర్యుడి నుండి దూరంగా ఉన్నప్పుడు (చిత్రం 4లో స్థితి ఎ) అలాగే ఉండే చిత్రాన్ని గీయండి. సూర్య కిరణాలు ఎక్కడ లంబంగా ఉంటాయి? ఈ చివరి స్థితిలో, దక్షిణ అర్ధ గోళంలో పగలు చాలా ఎక్కువ సమయం ఉన్నప్పుడు, సుమారుగా డిసెంబర్ 22 నాడు సంభవిస్తుంది మరియు 'డిసెంబర్ అయనాంతం (డిసెంబర్ సోల్‌స్టైస్)' అంటారు. 23 సెప్టెంబర్ నుండి 20 మార్చ్ వరకు మొత్తం సమయం, ఉత్తర అర్ధ గోళంలో పగలు 12 గంటల కన్నా తక్కువగా ఉంటుంది; కావున ఉత్తర ధృవంలో శీతాకాలం మరియు దక్షిణ ధృవంలో వేసవి కాలం అవుతుంది.


భూమి యొక్క కక్ష్యలో, రెండు స్థితులు ఉత్తర ధృవం గానీ లేదా దక్షిణ ధృవం గానీ సూర్యుడి వైపు వాలుగా ఉండవు. ఈ స్థితులలో, భూమి యొక్క భూ మధ్య రేఖ సూర్యుని కేంద్రం నుండి వెళుతుంది (చిత్రం 5లో సూర్యుడు స్క్రీన్ ముందు ఉన్నాడని, మీ తల ఎడమ వైపు కాకుండా కుడి వైపు ఉన్నాడని ఊహించుకోండి2).ఈ రెండు స్థితులలో పగలు మరియు రాత్రి సమాన వ్యవధిలో (12 గంటలు) ఉంటాయి.ఈ రెండు రోజులు 20 మార్చ్ మరియు 23 సెప్టెంబర్ అని ఊహించవచ్చు; ఈ రెండు రోజులను 'విషవత్తులు' అంటారు.

2చిత్రం 5లో చూపినట్లు సూర్య కిరణాలు వస్తుంటే, అక్షం స్క్రీన్ యొక్క తలానికి లంబ తలం నుండి బయటికి వస్తుంది.
 

[Contributed by administrator on 10. Januar 2018 21:24:04]