clix - Ecosystem
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Ecosystem

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

Lesson 7 - కార్యకలాపం 1

కార్యకలాపం 1 ​: చేపల చెరువు గురించి మనం మాట్లాడదాం

 

కేవలం నాచుని మాత్రమే తినే చేపల రకాలు మాత్రమే పెరిగే చేపల చెరువులు ఉన్నాయి. ఉదాహరణకు, టైలాపియా చేప. ఇది మంచి పరిమాణంలో నాచుని తినటంతో పాటు చెరువుల్లో ఇవ్వబడే  కృత్రిమ ఆహారాన్ని కూడా తింటాయి. 

 

రైతులు ఆవు పేడ, గువానో మొదలైన వాటిని  చెరువుకు పరిచయం చేస్తారు. కుళ్లే విధంగా చేసేవి నిర్జీవ భాగాల్ని ముక్కలు చేస్తాయి మరియు పోషకాల్ని విడుదల చేస్తాయి. ఈ నిర్జీవ భాగాలు మరియు కాంతి సహాయంతో నాచు  చెరువులో పెరుగుతుంది.

ఈ నాచుని తిని, టైలాపియా చేప పెరుగుతుంది మరియు వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. 

చేపలకి ఆకలిగా ఉంటే అవి మరింత నాచుని తింటాయి. చెరువులో చేపల సంఖ్య పెరిగినప్పుడు అవి తినటానికి మరింత నాచు అవసరం. ఫలితంగా చెరువులో ఉన్న నాచు సంఖ్య తగ్గిపోతుంది. ఆహారం లభించకపోవటం వల్ల చేపలు ఆకలితో బాధపడి చివరకు మరణిస్తాయి. 

అటువంటి విపత్తుని నివారించటానికి రైతులు తమ చెరువుని నిరంతరం తనిఖీ చేయాలి మరియు తాము పెంచే చేపలకు కావల్సినంత ఆహారం లభిస్తోందని తెలుసుకోవాలి. నాచు మరియు చెరువులో ఉండే చేపల మధ్య సున్నితమైన సంతులితని ఎలా నిర్వహించాలో వారు నేర్చుకోవాలి. 

 

కేవలం నాచుని మాత్రమే తినే  చేపల్ని పెంచే  చేపల రైతు పాత్రని పోషించే ఆట ఆడుదాం.

 

మీరు ఆటని ప్రారంభించిన తర్వాత, స్లైడర్లని ఉపయోగిస్తూ మీరు ఈ క్రింది కొలప్రమాణాల్ని ఏర్పాటు చేయవచ్చ

 

నాచు సంఖ్య
చేపల సంఖ్య
చేపల ఆకలి

నాచు పునరుత్పత్తి రేటు 
(speed with which the number of algae increases)

 
Star Logo Thumbnail

 

మీరు ఆటని ఆడేటప్పుడు పెట్టెల్లో ఉన్న చేపలు మరియు నాచు సంఖ్యలో మార్పుని మీరు చూడవచ్చు. ప్రక్కన  చేపలు మరియు నాచు మధ్య సంబంధాన్ని మీరు పోల్చగలిగే వాటి సంఖ్యని తెలియచేసే సంఖ్య కూడా  గ్రాఫ్ కూడా కనిపిస్తుంది. 

 

ఇప్పుడు తనిఖీ చేద్దాం.

 

పరిస్థితి  1:          

నాచు పునరుత్పత్తి రేటుని 10గా మరియు ఆకలిని 10గా మరియు నాచుని 100 సంఖ్యగా ఏర్పాటు చేద్దాం. సమయం 400కి చేరుకున్నప్పుడు చేపల సంఖ్యకి ఏమి జరుగుతుందో తనిఖీ చేద్దాం.​

పరిస్థితి  2:

నాచు సంఖ్యని 200కి మార్చండి, చేపల జనాభాకి ఏమి జరుగుతుందో తనిఖీ చేయండి.​

పరిస్థితి  3:

మీరు నాచు పునరుత్పత్తి రేటుని 10 నుంచి 0కి తగ్గించినప్పుడు మీ చేపలకు ఏమి జరుగుతుందో తనిఖీ చేద్దాం.​

పరిస్థితి  4:

ఆకలి రేటుని 5 నుంచి 10కి పెంచి మీ చేపలకి మరింత ఆకలి పెంచండి మరియు నాచు జనాభాకి ఏమి జరుగుతుందో చూడండి.​

 


ఈ క్రింద ఇచ్చిన గ్రాఫ్ ని చూసి చేపలకు ఏమి జరిగిందో మీరు చెప్పగలరా


Graph 1

 
condition

[Contributed by administrator on 10. Januar 2018 21:32:47]