clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

3.1.1 అధిక రక్త పోటు

అధిక రక్త పోటు


ఒక వ్యక్తి యొక్క రక్తపోటు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. రక్తము, నాళికల ద్వారా ప్రవహించడము అనేది దీని కారణాలలో ఒకటి. మన శరీరాల్లో పైపుల ద్వారా రక్తం ప్రవహిస్తే, అవి పైపుల గోడలపై ఒత్తిడిని పెరిగేలా చేస్తాయి. రక్తము సులభముగా ప్రవహించడము అనేది మన రక్త పీడనం ద్వారా జరుగుతుంది.  రక్త నాళము యొక్క నడిమి కొలత మరియు వాటిలో ఏదైనా అవరోధం వున్న, ఈ ప్రవాహము మీద ప్రభావితం అవుతుంది. మన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి స్థాయి మరియు వ్యాయామము క్లిష్టమైన రీతిలో మన రక్తపోటును ప్రభావితం చేస్తాయి.  వంశానుగత కారకాలు ద్వారా కూడా రక్తపోటు ప్రభావితమవుతుంది. తల్లిదండ్రులు ఇద్దరిలో గాని లేదా ఒకరిలో గాని అధిక రక్త పోటు ఉన్నట్లయితే, వారి కుమారుడు / కుమార్తెలకు అధిక రక్తపోటు వుండే అవకాశాలు పెరుగుతాయి.

హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటును గురించిన కథను చదువుదాము.

కొన్ని రోజులుగా, సునీతా తల్లికి ఆరోగ్యము సరిగా లేదు. ఆమె దాదాపు 2 వారాలపాటు,  అలసటతోఉండి మరియు తలనొప్పికి గురైనప్పటికీ, డాక్టరును కలవడానికి వెనుకాడింది. ఇవి ఏమి తీవ్రమైన లక్షణాలు కాదని, ఆమె అనుకుంది. సునీత ఆమెని ఒప్పించి, డాక్టర్ మహీతో సంప్రదించడానికి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది. వారి టర్న్ కోసం అరగంట వేచి చూసిన తర్వాత, డాక్టర్ వున్న గదిలోనికి వెళ్లారు. గత కొద్ది రోజులుగా ఆమెకు మంచిగా లేదని సునీతా తల్లి, డాక్ట మాహికి  చెప్పింది. ఆమె తొందరగా అలసిపోతోందని చెప్పింది. డాక్టర్ ఆమె తల్లికి, రక్తపోటును పరీక్ష చేయాలని చెప్పారుbbpmachine2

డాక్టర్ ఒక బాక్స్ లో వుండే పరికరం లాంటి దాన్ని తెరవడము సునీత చూసింది. దీని మూతకి  ఒక స్కేల్ కలిగి ఉండి, కొంత ద్రవ పదార్థమును కలిగి ఉంది. అయితే బాక్స్ లోపల, రబ్బరు బ్యాగుతో ఒక కఫ్  మరియు రబ్బరు పుంపు ఉంది. డాక్టర్, సునీతా తల్లితో మాట్లాడుతూనే, ఆమె చేయి చుట్టూ కఫ్ గట్టిగా చుట్టివేసారు. ఆమె స్టెతస్కోప్ ను కూడా ఉపయోగించింది. ఆమె సునీత తల్లిని  'మీ వయస్సు ఎంత? అని అడిగారు. ఆమె ఆహార అలవాట్లు మరియు ఒత్తిడి గురించి అడిగారు. ఆమె రక్తపోటు సాధారణము కంటే ఎక్కువ ఉందని చెప్పి మరియు అది క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.


"రక్తపోటు? అది ఏమిటి? "సునీత అడిగింది.
 

డాక్టర్ మహీ ఆమెతో ఇలా అన్నది, "మన శరీరంలో రక్తం తీసుకొనే గొట్టాలపై, రక్తం చేస్తున్న ఒత్తిడి ఇది. ప్రతిసారీ గుండె కొట్టుకున్నప్పుడల్లా, ఇది రక్తనాళాలలో కొంచెం ఒత్తిడితో రక్తాన్ని నెడుతుంది. రక్తపు పైపుల ఒత్తిడిని కొలవడానికి, రక్తపోటు మీటర్ ఉపయోగించబడుతుంది. శరీరంలో హృదయ స్పందనల ద్వారా చేసే శబ్దాన్ని వినడానికి స్టెతస్కోప్ ఉపయోగించబడుతుంది."


ఇది అంతా సునీతకి ఆశ్చర్యకరంగా అనిపించింది.

"రక్తపోటు లేదా 'బిపి', చాలామంది వ్యక్తులకు, రోజులో ఎక్కువగా వైవిధ్యభరితముగానే ఉంటుంది" అని డాక్టర్ చెప్పడం కొనసాగించింది. "ఆ స్థాయిని సాధారణ పరిధి అని పిలుస్తారు. కొన్నిసార్లు ఒక వ్యక్తి యొక్క రక్తపోటు, సాధారణ స్థాయి కంటే నిరంతరం ఎక్కువ లేదా తక్కువగా మారుతూ ఉంటుంది మరియు ఇది మన శరీరానికి చాలా ప్రమాదకరమైనదిగా  ఉంటుంది."


ఆమె కొన్ని మందుల్ని రాసి ఇచ్చి, ఒక వారం తర్వాత వచ్చి ఆమెను చూపించుకోమన్నారు. సునీత తల్లికి తన ఆహారంలో ఉప్పును, చమురును తగ్గించాలని సలహా ఇచ్చారు మరియు ఆమె బి.పి.ని క్రమము తప్పకుండా, సమయానికి పరీక్ష చేయించుకుంటూ ఉండమని చెప్పారు.

రక్తప్రవాహము మనలను ఎలా ప్రభావితము చేస్తుందో పరిశీలిద్దాము.

గుండె, రక్తమును రక్తనాళాలకు పుంపు చేస్తుంది మరియు ఈ నాళాలు వివిధ అవయవాలకు రక్తమును తీసుకుని వెళ్తాయి. వివిధ వ్యక్తులలో రక్తపోటు భిన్నంగా ఉంటుంది మరియు అదే వ్యక్తికి ఒక రోజులో కూడా మారుతుంది. మన రక్తపోటును ప్రభావితం చేయడానికి విభిన్నమైన అంశాలున్నాయి. అటువంటి కారకాలలో  రక్త ప్రవాహం ఒకటి. అంటే ఒక్కొక్క సమయంలో, ఎంతెంత రక్తం పైపుల ద్వారా ప్రవహిస్తుంది అనేది చెపుతుంది.
 

ప్రశ్న: రక్తనాళాల ద్వారా ప్రవహించే రక్తం యొక్క ప్రవాహాన్ని ఏది తగ్గిస్తుంది?

ఒక అంచనా తయారు చేద్దాము.

[Contributed by administrator on 14. März 2018 20:01:32]