clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.1 ఆరోగ్యము అంటే ఏమిటి?

ఆరోగ్యము అంటే ఏమిటి?


'ఆరోగ్యం' అనేది మనకు చాలా బాగా తెలిసిన పదము. మనము మన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు నుండి ఆరోగ్యకరమైన అలవాట్లు గురించి, మన పుస్తకాలలో ఆరోగ్యంగా ఎలా ఉండాలనే వాటి గురించి తెలుసుకుంటాము. మనము టెలివిజన్ లో చూసి కూడా  చాలా విషయాలు  మన ఆరోగ్యానికి ఏది మంచిది మరియు ఏది మంచిది కాదు అనే వాటి గురించి చూసి తెలుసుకుందాము.

Use the space below to write all the things that you would associate with a healthy person:

ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి గురించి మీరు ఆలోచించినప్పుడు, మీ మనస్సుకు వచ్చే విషయాలు ఏమిటి?

మీరు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిని గురించి, వారికి సంబంధించిన అన్ని విషయాలను రాయడానికి క్రింద ఉన్న స్థలాన్ని ఉపయోగించండి.

ఇప్పుడు మీ దగ్గర ఒక వ్యక్తి ఆరోగ్యంగా వున్నాడు అని సూచించే విషయాల గురించిన జాబితా ఉంది. వీటిని "మన ఆరోగ్య సూచికలు" అని పిలుస్తాము.

WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) పేరుతో ఉన్న ఒక సంస్థ కూడా ఆరోగ్యమును నిర్వచించటానికి సూచనలు ఇచ్చింది. పలు సందర్భాల్లో అధ్యయనం చేసిన తరువాత వారు ఆరోగ్యాన్ని ఇలా నిర్వచించారు:

"సంపూర్ణ భౌతిక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క స్థితి మరియు కేవలం ఏ వ్యాధి లేక బలహీనత లేకపోవడం కాదు."

physical


social mental


సరళంగా చెప్పాలంటే, ఆరోగ్యం అనేది కేవలం ఏ వ్యాధి లేకపోవడమే కాదు.

ఇది ఒక స్థితి అనగా, రోజు వారీ మనము శరీరముతో చేసుకునే పనులను సక్రమముగా చేసుకోవడము (భౌతిక ఆరోగ్యం) , మన సామర్ధ్యాలను అర్థం చేసుకోగలగడము, మన జీవితంలోని సాధారణ మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోగలగడము (మానసిక ఆరోగ్యం), మన పరిసరాలు శుభ్రంగా మరియు పరిశుభ్రమైనవిగ వుంచుకోవడము, కుటుంబం, స్నేహితులు మరియు ఇరుగు, పొరుగువారితో స్నేహపూరితమైన పరస్పర సంమబంధాలను కలిగి వుండటము మరియు మన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల కోసం మనము శ్రద్ధ కలిగి ఉండటము (సామాజిక ఆరోగ్యం).

మీకు సూచించిన సూచికలను ఉపయోగిస్తూ, మీరు భౌతిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మరియు సాంఘిక ఆరోగ్యముల జాబితా మరియు వర్గీకరణ చేయగలరా?

[Contributed by administrator on 8. April 2019 18:03:23]